BigTV English

lakshmi Devi: శుక్రవారం లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే కష్టాలు తొలగిపోతాయ్

lakshmi Devi: శుక్రవారం లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే కష్టాలు తొలగిపోతాయ్

lakshmi Devi : సనాతన ధర్మంలో వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది. శుక్రవారం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. హిందూ మతాన్ని విశ్వసించే వ్యక్తులు శుక్రవారం లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక చర్యలు పూజలు చేస్తారు. ఈ పూజలు చేయడం వల్ల జీవితంలో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలను పరిష్కారం అవుతాయి.


లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలు..

హిందూ మతంలో శంఖం, తల్లి లక్షీదేవికి సోదరుడిగా పరిగణించబడుతుంది. అందుకే అమ్మవారి పూజలో శంఖానికి ఎప్పుడూ స్థానం ఇవ్వండి. దక్షిణావర్తి, మధ్య శంఖం శుభప్రదం. శంఖం కూడా సముద్ర మథనం నుంచి ఉద్భవించింది. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు చేకూరుతాయని చెబుతారు.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, లక్ష్మీ దేవిని పూజించే సమయంలో ఆలయంలో నాలుగు వైపులా దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పూజ సమయంలో నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించడం వల్ల మీ ఇంటికి, కుటుంబానికి సానుకూల శక్తి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఎప్పుడూ ధన నష్టం కలగదు.

Also Read: వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి

మత విశ్వాసాల ప్రకారం, ఇంటిలోని దేవుడి గదిలో శ్రీ హరి విగ్రహాన్ని ఉంచండి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. పూజ గదిలో ప్రతిష్టించిన శ్రీ హరిని నిత్యం పూజించడం కూడా అవసరమని గుర్తుంచుకోండి.

లక్ష్మీదేవికి తామర పువ్వు చాలా ప్రీతికరమైనది. కాబట్టి పూజలో తామర పువ్వును సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ వ్యాపారంలో ధనలాభం, నిరంతర పురోగతి ఉంటుంది. మీ జీవితంలో జరుగుతున్న ఆర్థిక నష్టం నుంచి కోలుకోవడంలో ఇది మీకు సహాయ పడుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×