BigTV English

Revanth Reddy: ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత కేసీఆర్.. ఎక్కడున్నారు?: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత కేసీఆర్.. ఎక్కడున్నారు?: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఖమ్మం వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అనంతరం కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వర్షాలు, వరదల కారణంగా 16 మృతిచెందడం అత్యంత బాధాకరం. ముంపు బాధితులను ఆదుకుంటాం. ముంపు ప్రంతాల్లో అంటురోగాలు విజృంభించే అవకాశం ఉంది. అంటురోగాలు విజృంభించకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. వరద బాధితులు సర్వం కోల్పోయారు. బాధితులకు ఆహారం, తాగునీరు, మెడిసిన్స్ అందిస్తున్నాం. ఎక్కడికక్కడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.


Also Read: ఏ ఏ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా పడింది..? ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే..??

ఈ సంక్షోభ సమయంలో మంత్రులంతా ప్రజల వద్దే ఉండాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించాం. పంటనష్టం వివరాలను కూడా సేకరిస్తున్నాం. నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ. పది వేల చొప్పున పరిహారం అందజేస్తాం. విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసేందుకు రాష్ట్రాంలోని 8 ప్రాంతాల్లో విపత్తు బృందాలను ఏర్పాటు చేస్తాం.


ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాశాం. ఇలాంటి వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలని ఆ లేఖలో ప్రస్తావించాం. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం చేయాలి. ఇలాంటి విపత్తును గతంలో ఎప్పుడూ చూడలేదు. రూ. 5430 కోట్ల సాయం అదించాలని కోరాం. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించాలి. నష్టాన్ని అంచనా వేసి సాయం అదించాలి. ఇలాంటి ఆపద సమయంలో రాజకీయాలకు అతతీంగా ఆలోచించాలి.

Also Read:రేవంత్ సర్కారు విఫలం.. ఇదేనా ప్రజాపాలన?

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత ఎక్కడున్నారు? బయటకు వచ్చి ప్రజల కష్టాలను తెలుసుకుని కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వం కంటే ముందు ప్రతిపక్ష నేతలే వెళ్తారు. కానీ, కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రావడంలేదు. ఏపీలో ప్రతిపక్ష నేత కూడా వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతున్నారు. కాసీ, తెలంగాణలో మాత్రం కేసీఆర్ పర్యటించడంలేదు. కేటీఆర్ అమెరికాలో ఉండి.. ఖమ్మం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులపై విమర్శలు చేస్తున్నాడు. అమెరికాలో ఎంజాయ్ చేస్తూ మంత్రులను బద్నాం చేయడం సరికాదు. బీఆర్ఎస్ నేతల వైఖరిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వెంకయ్యనాయుడు ముందుకువచ్చి నైతిక మద్దతును ఇచ్చారు. కానీ, కేసీఆర్ స్పందించరు.. కష్టాల్లో ఉన్న ప్రజలను పలకరించరు. విపత్తుల వేళ బీఆర్ఎస్ నేతలు ముందుకు వచ్చి ప్రజలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వడంలేదు.. పైగా ఆదుకుంటున్న ప్రభుత్వంపై విమర్శలు. వరద సమయంలో బురద రాజకీయాలు మానుకోవాలి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related News

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

Big Stories

×