E-Paper
Advertisement

Surya Gochar 2024: 2 రోజుల్లో ఈ రాశుల వారి జీవితంలో మహా అద్భుతం.. మీ రాశి ఇందులో ఉందా..?

Surya Gochar 2024: 2 రోజుల్లో ఈ రాశుల వారి జీవితంలో మహా అద్భుతం.. మీ రాశి ఇందులో ఉందా..?
Advertisement

Surya Gochar 2024: మరో రెండు రోజుల్లో సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. 15వ తేదీన ఉదయం 4.27 గంటలకు సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దాదాపు సంవత్సరం తర్వాత ఈ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం సూర్య గ్రహం వృషభ రాశిలో సంచరిస్తుంది. అయితే సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల పలు గ్రహాలకు శుభ, అశుభ పరిణామాలు కలగనున్నాయి. ఈ నెల సూర్యుడి గ్రహ మార్పు కారణంగా 5 రాశుల వారికి చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆర్థిక లాభాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మేష రాశి:

Advertisement

సూర్యుడు అన్ని గ్రహాలపై సమాంతర ప్రయోజనాలు చూపించినా కూడా కొన్ని సార్లు తన రాశిని మార్చుకోవడం వల్ల పలు రాశులపై అధిక ప్రభావం చూపబోతున్నాడు. అయితే మేషరాశి వారికి సూర్యుడి సంచారం ఓ వరం కానుంది. వృత్తిలో పురోగతి పొందే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో కూడా చాలా ప్రయోజనాలు, లాభాలు పొందుతారు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి.

2. సింహ రాశి:

Advertisement

సింహ రాశికి అధిపతి సూర్య దేవుడు అనే విషయం అందరికీ తెలిసిందే. మిమ్మల్ని అవమానించాలని ప్రయత్నించే వ్యక్తులు కూడా స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తారు. సూర్యుడి రాశి మార్పు వల్ల సింహ రాశి వారు చాలా లాభాలు పొందనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

Also Read: Astrology: రాశి ఫలాలు..వారికి వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి 

3. కన్యా రాశి:

సూర్య దేవుడు కన్యారాశి వారికి అద్భుత ఫలితాలను ఇస్తాడు. ఊహించని విధంగా వీరు చేసే పనిలో లాభాల వర్షం కురవనుంది. ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతిని పొందుతారు. సంపద కూడా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. వాహనం కొనడానికి ఇది అనుకూలమైన సమయం.

4. తుల రాశి:

తులా రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. చేపట్టిన పనులు కాస్త ఆలస్యం అయినా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. కెరీర్‌లో మార్పు సంతోషకరమైన ఫలితాలను ఇవ్వనుంది. ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది.

Also Read: Saturday Pooja: శనివారం వెంకటేశ్వర స్వామిని ఇలా పూజించారంటే మీ అప్పలు బాధ మాయం..

5. వృశ్చిక రాశి:

సూర్య సంచారం వలన ఈ రాశి వారికి మంచి ఫలితాలు లభించబోతున్నాయి. పదోన్నతి, జీతం పెరుగుదల గురించి శుభవార్త వింటారు. అలుపెరుగని ధైర్యం, శక్తి కూడుకుని అసాధ్యమైన పనులను చేస్తారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×