BigTV English

Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్..

Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్..

Ajit Doval Reappointed As National Security Advisor: మరోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మరోసారి నియమితులయ్యారు. మూడోసారి అజిత్ దోవల్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రాను నియమించింది కేంద్ర ప్రభుత్వం. కాగా వీరి నియామకం జూన్ 10 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


వీరిరువురు ప్రధానమంత్రి పదవీ కాలంలో ఉన్నంత వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు తమ పదవుల్లో కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం తమ ప్రకటనలో పేర్కొంది. అజిత్ దోవల్, పీకే మిశ్రా ఇద్దరికీ క్యాబినెట్ ర్యాంక్ దక్కనున్నట్లు ప్రకటనలో తెలిపింది కేంద్ర ప్రభుత్వం.

మరో రెండేళ్లపాటు ప్రధాని కార్యాలయంలో అమిత్ ఖరే, తరుణ్ కపూర్‌లను ప్రధానమంత్రి సలహాదారులుగా పునఃనియమించడాన్ని కూడా క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. వీరివురూ సెక్రటరీ ర్యాంకు హోదాలో తమ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.


Also Read: యడియూరప్ప అరెస్ట్ తప్పదా.. ?

జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన అజిత్ దోవల్ ప్రధాని మోదీకి అత్యంత విశ్వసనీయ సహాయకులలో ఒకరు. దోవల్ 2014 నుంచి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. అజిత్ దోవల్ రళ కేడర్‌కు చెందిన 1968-బ్యాచ్ IPS అధికారి. కీర్తి చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి పోలీస్‌గా దోవల్ చరిత్ర పుటల్లో నిలిచారు. అన్ని ఉగ్రవాద వ్యతిరేక, గూఢచార సంస్థలను కలిగి ఉన్న జాతీయ భద్రతా స్థాపనకు బాధ్యత వహించే వ్యక్తిగా దోవల్ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన అధికారులలో ఒకరు.

Tags

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×