E-Paper
Advertisement

Indira Ekadashi: మోక్షసిద్ధినిచ్చే ఇందిరా ఏకాదశి.. ఈ రోజు ఏం చేయాలంటే?

Indira Ekadashi: మోక్షసిద్ధినిచ్చే ఇందిరా ఏకాదశి.. ఈ రోజు ఏం చేయాలంటే?
Advertisement

Indira Ekadashi: చాంద్రమానం ప్రకారం.. పక్షము అంటే 15 రోజులు. నెలకు 2 పక్షాలుంటాయి. ఒకటి శుక్లపక్షము.
అనగా..అమావాస్య తరువాతిరోజు పాడ్యమి నుండి మొదలు పౌర్ణమి వరకు గల 15 రోజులు. రెండు.. కృష్ణ పక్షం. పౌర్ణమి మరునాటి నుంచి మరుసటి అమావాస్య వరకు ఉండే 15 రోజులు.
ఇలా.. శుక్లపక్షంలో ఒక ఏకాదశి, శుక్లపక్షంలో ఒక ఏకాదశి చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో భాద్రపదమాసంలో, పితృపక్షాల సమయంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు.
ఈ ఏడాది ఇందిరా ఏకాదశి.. అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12:36 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నం 3:08 గంటల వరకు కొనసాగనుంది.
ఈ ఏకాదశి రోజున వేకువనే నిద్రలేచి, ఉపవాసం చేసి, విష్ణుపూజ (సాలిగ్రామ స్వామి) చేసి, పూర్వీకులకు శ్రాద్ధం చేయడంతోపాటు తర్పణాలు వదలాలి.
గోవులకు ఆహారం ఇవ్వటం, పేదలకు అన్నదానం చేసి, మరునాడు పూజానంతరం ఉపవాసాన్ని విరమించాలి.
ఈ రోజున సూర్యోదయం, సూర్యాస్తమయ వేళ తులసి చెట్టు ముందు 5 నెయ్యి దీపాలు వెలిగించి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించి, 11 ప్రదక్షిణలు చేయాలి.
ఈ రోజు ఎవరైతే ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో.. వారి గతించిన పూర్వీకుల పాపాలు తొలగిపోయి, వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం.
అలాగే.. ఈ రోజున ఐదు తమలపాకులపై ‘శ్రీ’ అని రాసి విష్ణుమూర్తికి సమర్పించాలి. అనంతరం వాటిని ఎర్రని వస్త్రంలో కట్టి అల్మారా వంటి ప్రదేశంలో భద్రపరచటం వల్ల వ్యాపారాభివృద్ధి సిద్ధిస్తుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×