BigTV English
Advertisement

Vastu Tips: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. లక్ష్మీ దేవి కటాక్షం ఉన్నట్లే

Vastu Tips: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. లక్ష్మీ దేవి కటాక్షం ఉన్నట్లే

Vastu Tips: చెట్లు, మొక్కలు లేకుండా భూమిపై జీవితం సాధ్యం కాదు. చెట్లు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. హిందూ మతం, సంస్కృతిలో, మొక్కలు పర్యావరణానికి ప్రత్యేకమైనవిగా పరిగణించబడతాయి. అంతే కాకుండా ఇవి జీవితంలో శ్రేయస్సుకు చిహ్నంగా కూడా పరిగణించబడతాయి. హిందూ మత గ్రంథాలు, వాస్తు శాస్త్రంలో ఇటువంటి అనేక మొక్కల వివరణ ఉంది. ఇవి పచ్చదనాన్ని అందించడమే కాకుండా దురదృష్టం, వాస్తు సంబంధిత లోపాలను కూడా తొలగిస్తాయి.


వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో నాటినప్పుడు వాస్తు దోషాలను తొలగించడమే కాకుండా ఆర్థిక శ్రేయస్సును పెంచుతాయి. అంతే కాకుండా అయస్కాంతంలా సంపదను ఆకర్షిస్తాయి. పేదరికాన్ని తొలగించి అపారమైన సంపదను తెచ్చే మొక్కలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రాసులా మొక్క:
వాస్తు శాస్త్రం ప్రకారం క్రాసులా మొక్క చాలా ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోయి ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అంతే కాకుండా దీని చిన్న ఆకులు సంపదను ఆకర్షించే ప్రత్యేక శక్తిని కలిగి ఉంటాయి. ఈ మొక్కను నాటిన ఇళ్లలోకి పేదరికం ప్రవేశించదు. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.


తులసి మొక్క:
హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్ర మైనదిగా పరిగణించ బడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీ దేవి నివసిస్తుందని చెబుతారు. ఇది విష్ణువుకు చాలా ప్రియమైనది. తులసి మొక్కను నాటి పూజలు క్రమం తప్పకుండా చేసే ఇళ్లలో డబ్బుకు కొరత ఉండదు. ఇంట్లో తులసి మొక్క ఉండటం వల్ల అన్ని రకాల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోయి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.

మనీ ప్లాంట్:
ప్లాంట్ సంపద, శ్రేయస్సుకు మంచిదని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో.. మనీ ప్లాంట్ శుక్ర గ్రహానికి సంబంధించినది. మనీ ప్లాంట్ నాటిన ఇళ్లలో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు, సంపద ఉంటాయి. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. డబ్బుకు కూడా ఎలాంటి లోటూ ఉండదు. మనీ ప్లాంట్ ఇంట్లో సానుకూలమైన శక్తిని ప్రసరింపజేస్తుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి అందిస్తుంది.

Also Read: సూర్యుడి సంచారం.. జులై 16 నుంచి వీరు పట్టిందల్లా బంగారం

వెదురు మొక్క:
వెదురు మొక్కను శుభం, దీర్ఘాయువులకు చిహ్నంగా భావిస్తారు. ఈ మొక్క ఫెంగ్ షుయ్, భారతీయ వాస్తులో శ్రేయస్సును తెస్తుందని భావిస్తారు. వాస్తు ప్రకారం.. దీనిని ఇంటి తూర్పు దిశలో లేదా గదిలో ఉంచాలి. ఈ వేగంగా పెరుగుతున్న మొక్క జీవితంలో పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాకుండా ఇంట్లోని సమస్యలను కూడా తగ్గిస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్కను పెంచడం చాలా మంచిది.

ఉసిరి మొక్క :
మతపరమైన దృక్కోణం నుంచి, ఉసిరి చెట్టును విష్ణువు, లక్ష్మీ దేవి నివాసంగా భావిస్తారు. ఉసిరిని నవమి రోజు దీనిని పూజించడం వల్ల ప్రత్యేక పుణ్యం లభిస్తుంది. పురాణాల్లో కూడా ఉసిరి ప్రాముఖ్యతను గురించి వివరించారు.

Related News

Palmistry: అరచేతుల్లో ఈ మూడు గుర్తులు ఉంటే చాలు, జీవితంలో డబ్బుకు లోటే ఉండదు

Karthika Masam 2025 : కార్తీక మాసంలో.. ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. ఉసిరి దీపం ఎందుకు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఇవి దానం చేస్తే.. జన్మజన్మల పుణ్యం

God Photos: మీ మొబైల్ స్క్రీన్ పై దేవుని ఫోటోలు పెట్టవచ్చా? ఎలాంటివి పెట్టకూడదు?

Good Luck: మీకు అదృష్టం కలిసొచ్చే ముందు కనిపించే నాలుగు శుభ సంకేతాలు ఇవే

Ayyappa Swamy Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం.. ఇంట్లోనే అరవణ పాయసం ఇలా తయారు చేయండి

Karthika Masam 2025: కార్తీక సోమవారం సాయంత్రం ఇలా పూజ చేస్తే.. విద్య, ఉద్యోగాల్లో తిరుగుండదు !

Big Stories

×