Punjabi Actress: పంజాబీ సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన తానియా(Tania) తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. తానియా తండ్రి అనిల్ జిత్ సింగ్ (Anil Jith Singh)ప్రముఖ డాక్టర్ అయితే ఆయన జులై 4వ తేదీ పంజాబ్‌లోని మోగాలోని తన క్లినిక్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఒకసారిగా ఆయనపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ప్రస్తుతం అనిల్ జిత్ సింగ్ మోగాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ దాడి గురించి ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన నివేదిక ప్రకారం..అనిల్ జిత్ సింగ్ విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ హోమ్ వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్ మీద రోగులుగా అక్కడికి వచ్చినట్లు తెలిపారు.
డాక్టర్ అనిల్ జిత్ సింగ్ కాంబోజ్..
ఇలా వారు డాక్టర్ అనిల్ జిత్ సింగ్ దగ్గర చికిత్స చేయించుకుంటున్నట్టు నటిస్తూ ఆయనపై కాల్పులు జరిపారని తెలుస్తుంది. ఇలా కాల్పులు జరపడంతో ఒక్కసారిగా అనిల్ జిత్ సింగ్ స్పృహ కోల్పోవడంతో వెంటనే తనని సమీపంలోని ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే తన శరీరంలో రెండు బుల్లెట్లు ఉన్నట్లు డాక్టర్లు తెలియజేశారు. ఇక ఈయనపై జరిగిన ఈ హత్య ప్రయత్నం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో నటి తానియా స్పందించారు.
తప్పుడు కథనాలను ప్రచారం చేయొద్దు..
తన తండ్రి పట్ల జరిగినటువంటి ఈ దాడితో తన కుటుంబం మొత్తం ఎంతో క్లిష్టమైన, బావోద్వేగా పరిస్థితులలో ఉన్నామని, ప్రస్తుత పరిస్థితులలో మీడియా వారు దయచేసి మాకు కాస్త ప్రైవసీ కల్పించాలని ఈమె కోరారు. అదేవిధంగా తన తండ్రిపై జరిగిన దాడి గురించి ఎవరు కూడా తప్పుడు కథనాలను ఊహించుకోవద్దు. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, మీ మద్దతుకు ధన్యవాదాలు అంటూ ఈమె పోస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం తానియా కుటుంబ పరిస్థితి తెలిసిన అభిమానులు తన తండ్రికి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తన తండ్రికి జరిగిన దాడి పట్ల కూడా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.
ఆసియా టీవీ అవార్డులు…
డాక్టర్ కాంబోజ్ కు గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అధికారికంగా ఎటువంటి ఎలాంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఇలా క్లినిక్ లో కాల్పులు జరపడంతో సమీప ప్రాంతాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ బృందాలను నియమిస్తూ దర్యాప్తును జరుపుతున్నారు. అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇక ప్రస్తుతం డాక్టర్ కాంబోజ్ పరిస్థితి మాత్రం విషమంగానే ఉందని తెలుస్తుంది. ఇక తానియా విషయానికి వస్తే.. 2018 సంవత్సరంలో ఈమె క్విస్మత్ (Qismat) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాకు గాను తానియా ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకున్నారు. అదేవిధంగా రెండు బ్రిట్ ఆసియా టీవీ అవార్డులకు ఎంపికయ్యారు ఇంకా పంజాబీ ఇండస్ట్రీలో నటిగా ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: థియేటర్‌లో డబ్బుల వర్షం.. నిర్మాత మిత్రా శర్మ ప్రకటన, తొక్కిసలాట జరిగితే?