BigTV English

Bhojanam:కుడిచేత్తో భోజనం చేయడం ఆచారమా….

Bhojanam:కుడిచేత్తో భోజనం చేయడం ఆచారమా….

Bhojanam:హిందూ సాంప్రదాయం ప్రకారం కుడి చేతిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కుడి చేత్తో భోజనం చేయడం వల్ల శరీరానికి, మనసుకు ఈ శక్తి అందుతుంది. కుడిచేతి వేళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుంది. అదేవిధంగా వేళ్ల ఆధారం దగ్గర సరస్వతి, మధ్య భాగంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. క‌నుక కుడి చేత్తో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల దైవం ఆశీస్సులు కూడా ల‌భిస్తాయి. యజ్ఞ యాగాలు, దానాలు కూడా కుడి చేత్తోనే చేస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈవిధంగా చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు. కుడి చేతితో పోల్చితే ఎడమ చేతికి శక్తి తక్కువ ఉంటుందని శాస్త్రీయంగాను తేలింది. కుడి చేయి ద్వారా ఎంతో విలువైన శక్తి శరీరానికి అందుతుంది.


మనిషి జీవనానికి ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి, జీవరసాయన ప్రక్రియలకు, ఆరోగ్యానికి, శక్తికి.. ఇలా ఎన్నో రకాలుగా మనం తీసుకునే ఆహారం వినియోగమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ అనుకూలతలు, ఇష్టాలు, స్థోమతలకు అనుగుణంగా వివిధ రకాల ఆహారాల‌తో భోజనం చేస్తుంటారు. అయితే ఎవరు ఏం తిన్నా తప్పనిసరిగా కుడి చేత్తోనే తింటారు. ఎడమ చేత్తో ఎవరూ తినరు.

ఎడమ చేతిని దేనికి ఉపయోగిస్తామో అందరికి తెలుసు. కొంతమంది చేతితో కాకుండా స్పూన్‌తో తింటారు. ఇలా చేయకూడదు. కొన్ని పరిస్థితుల్లో తప్ప మిగిలిన సమయాల్లో చెంచాలతో అన్నం తినడం చేస్తే ఆహారాన్ని అవ‌మానించిన‌ట్లే అవుతుంది. క‌నుక త‌ప్ప‌నిస‌రిగా చేతితోనే ఆహారం తీసుకోవాలి. ఎడ‌మ చేతి స్పూన్‌ను పట్టుకుని అస‌లు తిన‌కూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.


Gomati Chakra:గోమతీ చక్ర వృక్షంతో కలిగే ఫలితాలేంటి?

Gruhapravesam:గృహ ప్రవేశం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా…

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×