BigTV English

Kirankumar Reddy: కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీజేపీలోకి కిరణ్‌కుమార్ రెడ్డి?

Kirankumar Reddy: కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీజేపీలోకి కిరణ్‌కుమార్ రెడ్డి?

Kirankumar Reddy: కాంగ్రెస్‌కు మరో షాక్ తగలనుంది. సోమవారం ఆపార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈక్రమంలో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరిపారు. ఆయనకు జాతీయ స్థాయి పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందట. దీంతో త్వరలోనే కిరణ్‌కుమార్‌రెడ్డి కాషాయం కండువా కప్పుకోనున్నారు.


కిరణ్‌కుమార్ రెడ్డి 1989లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన తండ్రి అమర్‌నాథ్ రెడ్డి చనిపోవడంతో 1989 ఎన్నికల్లో వయల్‌పాడు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004, 2009లో ఇలా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు విభజన బిల్లుకు వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటును కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో పార్టీని రద్దు చేసి 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.


Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×