Big Stories

Food:- మనం తినే ఆహారంలో ఈ దోషాలు ఉంటే నష్టమేనా….

Food:- మనిషి బతకడానికి తినే ఆహారం ఎలా తింటున్నా…ఎలా తింటున్నామో ఎంత ముఖ్యమో మరో విషయం కూడా గుర్తుంచు కోవాలి. ఎక్కడ తింటున్నా..ఎవరు …ఎలాంటి పరిస్థితుల్లో వండారో కూడా తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు ఉండకుండా చూసుకోవాలి.

- Advertisement -

అర్ధ దోషం
నిమిత్త దోషం
స్ధాన దోషం
గుణ దోషం
సంస్కార దోషం.
ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.

- Advertisement -

అర్దదోషం
సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. అదే ఒంటికిపడుతుంది.

నిమిత్త దోషం
మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు ఉన్నవారు కావాలి. దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి.

స్థాన దోషం
ఏ స్ధలంలో ఆహారం వండుతున్నారో అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాలతో వంట కూడా పాడైపోతుంది. యుద్ధరంగానికి , కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు. దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని ఇచ్చింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు. మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి

గుణ దోషం
మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.
సంస్కారదోషం
ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది.సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని కలిగిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News