Black Objects In House: వాస్తు ప్రకారం కొన్ని రకాల రంగులు మన జీవితాలపై లోతైన ప్రభావాన్ని చూపుతాయని భావిస్తారు. ప్రతి రంగు మన జీవిత దిశను ప్రభావితం చేసే శక్తిని సూచిస్తుంది. మీ ఇంట్లో నల్లటి బట్టలు, ఫర్నిచర్ లేదా ఇతర అలంకరణ వస్తువులు ఎక్కువగా ఉంటే.. మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఈ రోజుల్లో నలుపు రంగు ఇంటీరియర్స్ , ఇంట్లో నల్లటి వస్తువులను ఉంచుకోవడం చాలా ట్రెండీగా మారింది. కానీ అది మీ ఇంట్లోని సానుకూల శక్తి, వాతావరణంపై చూపే ప్రభావం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?
ఇంట్లో నల్లని వస్తువుల వల్ల కలిగే ప్రయోజనాలు :
నలుపు రంగు అలంకరణ వస్తువులు ఇంటికి క్లాసీ లుక్ అందిస్తాయి.
ముఖ్యంగా ఫర్నిచర్ , గోడలపై నలుపు రంగును ఉపయోగించడం వల్ల అది చాలా కాలం పాటు కొత్త వాటిలాగా కనిపిస్తాయి.
నలుపు రంగు ప్రభావం స్థిరత్వాన్ని సూచిస్తుంది. దీని కారణంగా ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
నల్లని వస్తువుల వల్ల కలిగే నష్టాలు:
వాస్తు శాస్త్రం ,ఫెంగ్ షుయ్ ప్రకారం.. నలుపు రంగును అధికంగా ఉపయోగిస్తే ప్రతికూల శక్తిని ఇది ఆకర్షిస్తుంది. చాలా నల్లని వస్తువులు ఇంటిని నిస్తేజంగా, చీకటిగా కనిపించేలా చేస్తాయి. ఇది సానుకూలతను ప్రభావితం చేస్తుంది.
మీ ఇంట్లో నల్లటి ఉపరితలాలు ఎక్కువగా ఉంటే.. అవి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దీని వలన ఉష్ణోగ్రత పెరుగుతుంది.
గదిలో నల్ల రంగు వస్తువులను ఉపయోగించకూడదు. దీనివల్ల గ్రహ దోషాలు కూడా పెరుగుతాయి.
ఏం చేయాలి ?
నలుపును ఇతర ప్రకాశవంతమైన రంగులతో (తెలుపు, క్రీమ్, బూడిద రంగు లేదా పాస్టెల్ షేడ్స్ వంటివి) కలిపి ఉపయోగించండి.
Also Read: సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి అన్నీ మంచి రోజులే !
అవసరమైన ప్రదేశాలలో మాత్రమే నలుపును ఉపయోగించండి. గోడలు , పెద్ద ఫర్నిచర్‌పై కాకుండా, చిన్న డెకర్ వస్తువులు, కుషన్లు మొదలైన వస్తువులను నలుపు రంగును ఉపయోగించండి.
ఇంట్లో నల్లని వస్తువులు ఎక్కువగా ఉంటే.. సహజ కాంతి ఎక్కువగా వచ్చేలా జాగ్రత్త పడండి. అంతే కాకుండా వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోండి.
నల్లటి వస్తువులు ఇంటిని స్టైలిష్‌గా చూపిస్తాయి. కానీ వాటిని ఎక్కువగా వాడటం వల్ల ఇంట్లో భారమైన భావన కలుగుతుంది. మీరు శైలి, సానుకూల శక్తి ఇంట్లో ప్రసరించాలంటే నలుపు రంగు వస్తువులను తక్కువగా వాడటం మంచిది.