BigTV English

Heavy Rain Alert: రైతన్నలకు వర్షాల గిఫ్ట్.. నైరుతి వానలు ముందే.. IMD ప్రకటన..

Heavy Rain Alert: రైతన్నలకు వర్షాల గిఫ్ట్.. నైరుతి వానలు ముందే.. IMD ప్రకటన..

Heavy Rain Alert: రైతన్నా మేలుకో అన్నా.. నీ కోసమే ఆ వరుణుడు కరుణించాడు. ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త తొందరగానే వచ్చేస్తున్నాయి. మరెందుకు ఆలస్యం, అసలు నైరుతి రుతుపవనాల రాకతో రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఐఎండి చెప్పిన మాటేంటి? తెలుసుకుందాం.


వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..
దేశవ్యాప్తంగా గల రైతుల ఆశలకు తగినట్లుగా భారత వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది రైతులందరిలో అంచనాలకు మించి ఆశలు రేకెత్తిస్తున్న నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి భారత వాతావరణ శాఖ తాజాగా ఓ శుభవార్త చెప్పింది. సాధారణంగా మే 19న అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే రుతుపవనాలు, ఈసారి మే 13 నుంచే అక్కడ అడుగుపెట్టనున్నాయని ఐఎండి (IMD) అంచనా వేసింది.

భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం బంగాళాఖాతం ప్రాంతంలో అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల రుతుపవనాల అలజడి ముందుగానే ప్రారంభం కానుందని అంచనా. ఈ మార్పు వల్ల కేరళకు కూడా వర్షాలు సాధారణం కంటే త్వరగా తాకే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


రైతులకు పండగే..
దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులకిది ఒక శుభవార్తగా చెప్పవచ్చు. పంటల సాగుకు కావాల్సిన నీటి వనరులు ముందుగానే సిద్ధమయ్యే అవకాశముండటంతో, సాగు షెడ్యూల్‌ను రైతులు సమయానుకూలంగా చేసుకోవచ్చు. దీనితో ఖరీఫ్ సాగులో లాభాలు గడించే అవకాశం రైతులకు ఉందన్నది ఐఎండి అభిప్రాయం.

ముందే ఎందుకు?
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల వాయు మండలం వల్ల తూర్పు దిశ నుండి వచ్చే తేమ గాలులు వేగంగా కదిలిపోతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో పశ్చిమ గాలులు బలపడటంతో నైరుతి రుతుపవనాల కదలికలకు ఇది సహకరిస్తోందని వారి అభిప్రాయం. రుతుపవనాల ముందస్తు రాక వల్ల తక్కువ కాలంలో తీవ్రమైన వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉండొచ్చు. అందువల్ల ప్రభుత్వ యంత్రాంగం, రైతులు, ప్రజలంతా ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలట.

తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎలా ఉండబోతోంది?
నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో దక్షిణ భారతదేశ రాష్ట్రాలపై విస్తృత ప్రభావం చూపనుంది. ఈ ప్రభావం ఆయా రాష్ట్రాల వ్యవసాయ, నీటి లభ్యతను పెంచనుందని చెప్పవచ్చు. రాయలసీమ, ఉత్తర తీర ప్రాంతాల్లో సాధారణంగా జూన్ రెండవ వారంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి మే నెల చివర్లోనే వర్షాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పొలాలు సకాలంలో సాగుకు సిద్ధమవుతాయి. ఈ వర్షాలు కృష్ణ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టాలు పెరగడానికి దోహదం చేస్తాయి.

Also Read: Tirumala Tour: తిరుమలలో రహస్య పుణ్యక్షేత్రం.. మీరు మిస్ అవుతున్నారా?

తెలంగాణలో..
తెలంగాణలో వర్షాలు ముందస్తుగా రావడం వల్ల ఖరీఫ్ పంటలైన వరి, మొక్కజొన్న, పత్తి సాగు త్వరగా మొదలయ్యే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల్లో వర్షాభావానికి గురైన మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతులు ఈసారి స్వల్ప ఊపిరి పీల్చే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా భారీ వర్షాలు పడితే నష్టం వాటిల్లే అవకాశమూ లేకపోలేదని చెప్పవచ్చు. ఇలాంటి ముందస్తు వాతావరణ సమాచారాన్ని రైతులు తెలుసుకోవడం ద్వారా సులభతరమైన సాగు, నీటి నిర్వహణ సాధ్యమవుతుంది. భారత వాతావరణ శాఖ వెల్లడించిన ఈ అంచనాల ప్రకారం, ఈ ఏడాది వర్షాకాలం మంచి ఆశలు కలిగించేలా ఉండొచ్చు. అయితే వాతావరణంలో ఎప్పుడైనా మార్పులు జరిగే అవకాశం ఉంటందనేది కూడా వాతావరణ శాఖ తెలపడం విశేషం.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×