BigTV English

Temple Speciality: చనిపోయినవారిని బతికించే ఆలయం ఉందా…

Temple Speciality: చనిపోయినవారిని బతికించే ఆలయం ఉందా…

Temple Speciality: భూమి మీద పుట్టిన వారిని మరణం తప్పదు. ఎవరైనా సరే ఏదో ఒక సమయంలో భూమిని విడిచి వెళ్లిపోవాల్సిందే. ఒకసారి ప్రాణం పోయాక మళ్లీ వచ్చే అవకాశం లేదు. కానీ భారత దేశంలో చనిపోయిన వారిని తిరిగి బతికించగలిగే దేవాలయం ఉందన్నది వాస్తవం. ప్రపంచంలో టెక్నాలిజీ ఎంత పెరిగినా మనిషి బుర్రకు అర్థం కాని ఎన్ని విషయాలు ఈ విశ్వంలో ఉన్నాయి. అందులో చావు, పుట్టుకలు కూడా ఉన్నాయి. అందులోనూ ప్రాణం పోకడ గురించి ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. మనిషి ఆఖరి ఘడియలు ఎప్పుడు వస్తాయో ఎవరూ ఊహించలేరు. కాని ఈ దేవాలయంలో చనిపోయినవారు కొద్ది సేపు తిరిగి ప్రాణాలతో బతుకుతారు.


డెహ్రాడూన్ లోని లఖమండల్ దేవాలయంలో ఒక పురాతన దేవాలయం. ఇందు పరమశివుడు నిత్యం నివశించే ప్రాంతంగా స్థానికులు నమ్ముతారు . అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఈ లఖ్ మండల్ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయాన్నిసందర్శనం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుందని విశ్వాసం. పాండవులు కాలుపెట్టిన పవిత్రస్థలాల్లో లఖ్ మండల్ మందిరం కూడా ఒకటి. పాండవులు అజ్జాత వాసంలో ఉన్న సమయంలో ఈ గుడిలో కొద్ది రోజుల పాటు గడిపారని చెబుతారు. భారతదేశ పురావస్తుశాఖ అధీనంలో జరిపిన తవ్వకాల్లో అనేక కళాఖండాలు బయటపడ్డాయి. అందులో అతి ముఖ్యమైన ఆకర్షణ అంటే గ్రానైట్ తో ఏర్పాటుచేశారు. ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్న పచ్చదనం పరుచుకుని ఉంటుంది. ఒక్కసారి ఈ లింగాన్ని చూస్తే ఆధ్యాత్మిక ఉట్టిపడుతుంది.

ఈఆలయం గురించి స్థానికులు కొన్ని విషయాలు చెబుతుంటారు. ధుర్యోధనుడు పాండవులను లక్క గుహలో నిర్భంధించి చంపాలని నిర్ణయిస్తాడట.. ఆ గుహే ప్రస్తుత దేవాలయమని భక్తులు నమ్ముతారు.దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద మానవ, దానవ అనే రెండు ఎత్తైన విగ్రహాలు మనలను ఆకట్టుకొంటాయి. అయితే స్థానికులు మాత్రం ఈ రెండు విగ్రహాల్లో ఒకటి భీమసేనుడిదని, మరో విగ్రహం అర్జునుడిదని నమ్ముతారు. మానవ, దానవ ప్రతిమలను విష్ణువు నివశించే వైకుంఠం ద్వారపాలకులైన జయ విజేయులతో పోల్చేవారు . ఎవరైనా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లేదా చనిపోయిన వెంటనే ఈ రెండు విగ్రహాల ముందుకు తీసుకువచ్చి ఆ పరమశివుడు కొలువై ఉన్నట్లు భావించే ఇక్కడి శివలింగాన్ని అభిషేకించిన నీటిని చివరి ఘడియల్లో ఉన్న వారికి లేదా చనిపోయిన వ్యక్తి నోట్లో పోస్తే తిరిగి కొద్ది సేపు బతుకుతాడని స్థానికులు బలంగా నమ్ముతారు.


Srisailam Laddu: శ్రీశైలం లడ్డు తయారీలో భారీ అవినీతి..!

Tags

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×