E-Paper
Advertisement

Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో ఆ పనులు చేస్తే అదృష్టం వరిస్తుందట

Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో ఆ పనులు చేస్తే అదృష్టం వరిస్తుందట
Advertisement

Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో ఆ పనులు చేస్తే మీరు ఎప్పటికైనా అదృష్టవంతులు అవుతారట. నమ్మకం, భక్తితో చేసే ఏ పూజైనా మీకు ఫలిస్తుందట. బ్రహ్మముహూర్తానికి అంతటి పవర్‌ ఉంటుందిన పండితులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందు వచ్చే బ్రహ్మముహూర్తం (సుమారు తెల్లవారుజామున 4:00 నుండి 5:30 వరకు) అత్యంత శక్తివంతమైన సమయమట. ఈ సమయంలో చేసే పనులు శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక వృద్ధికి తోడ్పడతాయట.  అఇయతే బ్రహ్మముహూర్తంలో అదృష్టాన్ని మరియు విజయాన్ని ప్రసాదించే కొన్ని ముఖ్యమైన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కరదర్శనం (అరచేతులను చూసుకోవడం): నిద్రలేవగానే మొదటగా మీ రెండు అరచేతులను కలిపి చూసుకోవాలి. అరచేతి చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి, మూలంలో గోవిందుడు ఉంటారని శాస్త్రం చెబుతోందట. అందుకే అరచేతి చూసుకుంటూ ఈ కింద శ్లోకం చదువుకోవాలట.

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |

Advertisement

కరమూలే స్థితో గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ||

భూమాతకు నమస్కారం: మంచం దిగి నేలపై అడుగు పెట్టే ముందు భూమికి నమస్కరించాలట. మనం రోజంతా భూమిని తొక్కుతుంటాం కాబట్టి క్షమించమని ప్రార్థించడం ఒక ఉత్తమ సంస్కారమట.

ధ్యానం మరియు ఆత్మపరిశీలన: బ్రహ్మముహూర్తంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో కనీసం 10-15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందట ఒత్తిడి తగ్గుతుందట.. నేను ఎవరు? నా లక్ష్యం ఏమిటి? అనే ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది సరైన సమయమట.

ఇష్ట దైవ ప్రార్థన లేదా మంత్ర జపం: మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోవడం లేదా గాయత్రీ మంత్రం వంటి శక్తివంతమైన మంత్రాలను పఠించడం వల్ల సానుకూల శక్తి (Positive Energy) లభిస్తుందట. ఈ సమయంలో చేసే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయని పండితులు సూచిస్తున్నారు.

చదువు లేదా మేధోమథనం: విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే వారికి ఈ సమయం అమూల్యమైనదట. మెదడు ఈ సమయంలో చాలా చురుగ్గా ఉంటుందట కాబట్టి కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చట.

ప్రణాళికా రచన (Planning): రోజంతా మీరు చేయవలసిన పనుల గురించి ఒక స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఇది ఉత్తమ సమయమట. ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకుంటే ఆ రోజంతా పనులు విజయవంతంగా సాగుతాయట.

ఈ సమయంలో చేయకూడని పనులు: బ్రహ్మమూహూర్తంలో కొన్ని పనులు అసలు చేయకూడదట. అందులో మొదటిది ప్రతికూల ఆలోచనలు చేయడం మానుకోవాలట. కోపం, అసూయ లేదా బాధ కలిగించే విషయాల గురించి అసలు  ఆలోచించకూడదట. బ్రహ్మముహూర్తంలో భోజనం చేయడం నిషిద్ధమట. (అనారోగ్య సమస్యలు ఉన్నవారు మినహా). ఈ సమయంలో ఆహారం అసలు తీసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు.  ఇంకా ఫోన్ చూడటం లేదా టీవీ చూడటం వంటి పనుల వల్ల ఈ సమయం లో లభించే శక్తి వృధా అవుతుందట. బ్రహ్మముహూర్తంలో మేల్కొనే అలవాటు ఉన్నవారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు మనశ్శాంతి లభిస్తాయని పండితులు సూచిస్తున్నారట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఏ తేదీల్లో పుట్టిన వారు అత్యంత నమ్మకంగా ఉంటారో తెలుసా..

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×