E-Paper
Advertisement

ప్రపంచంలో అతిపెద్ద హోటల్.. అమ్మో, అన్ని వేల రూమ్స్ ఉన్నాయా?

ప్రపంచంలో అతిపెద్ద హోటల్.. అమ్మో, అన్ని వేల రూమ్స్ ఉన్నాయా?
Advertisement

World’s Largest Hotel in Malaysia: ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్‌ మలేషియాలో ఉంది. ఫస్ట్ వరల్డ్ హోటల్ & ప్లాజా పేరుతో నిర్మించిన ఈ హోటల్ జెంటింగ్ హైలాండ్స్‌ లో ఉంది. ఈ హోటల్‌ లో ఏకంగా 7,351 గదులు ఉన్నాయి. రెండు భారీ టవర్లలో నిర్మించబడిన ఈ హోటల్, వసతి సామర్థ్యం పరంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.

బయట అంత అందంగా కనిపించకపోయినా..

ఈ హోటల్ బయటకు చూసినప్పుడు చాలా ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు. డిజైన్ పరంగా పెద్దగా ప్రత్యేకత లేదు. 3 స్టార్ రేటింగ్‌ తో సాధారణ సౌకర్యాలను మాత్రమే అందిస్తుంది. కానీ, ఇక్కడి గదుల సంఖ్య, ఒకేసారి వేల మందికి వసతి కల్పించే సామర్థ్యం దీని ప్రత్యేకత.

2006లో ఈ హోటల్ ప్రారంభం

Advertisement

ఫస్ట్ వరల్డ్ హోటల్ 2006లో ప్రారంభమైంది. ఆ సమయంలో ఇందులో సుమారు 6,118 గదులు ఉండేవి. ఆ తర్వాత లాస్ వెగాస్‌ లోని వెనీషియన్ హోటల్ తన గదుల సంఖ్యను పెంచడంతో, ఈ హోటల్ తన ‘ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్’ అనే గుర్తింపును కోల్పోయింది. అయితే, 2015లో రెండవ టవర్‌ ను పూర్తి చేయడంతో గదుల సంఖ్య పెరిగి మళ్లీ ఈ గుర్తింపును పొందింది.

కౌలాలంపూర్‌కు 50 కి.మీ దూరంలో నిర్మాణం

ఈ హోటల్ ను జెంటింగ్ గ్రూప్ నిర్మించినది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహాంగ్ ప్రాంతంలో ఉంది. జెంటింగ్ హైలాండ్స్ ప్రాంతం వినోదానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ థీమ్ పార్కులు, షాపింగ్ మాల్స్, పలు ఎంటర్ టైన్ మెంట్ కేంద్రాలు ఉండటంతో ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

ఈ హోటల్ సక్సెస్ కు కారణం ఏంటంటే?

Advertisement

ఫస్ట్ వరల్డ్ హోటల్ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది దీని నిర్మాణ ప్రదేశం. ఇది రిసార్ట్స్ వరల్డ్ జెంటింగ్ మధ్యలో ఉండటంతో, పర్యాటకులకు అన్ని సౌకర్యాలు దగ్గరగా లభిస్తాయి. ముఖ్యంగా, మలేషియాలో చట్టబద్ధంగా ఉన్న ఏకైక క్యాసినో ప్రాంతానికి ఇది సమీపంలో ఉండటం కూడా పెద్ద ఆకర్షణగా మారింది.

ఈ హోటల్లో పలు రకాల రూమ్స్

ఇక్కడ గదుల రకాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. స్టాండర్డ్ రూములు, లగ్జరీ రూములు, ట్రిపుల్ రూములు, సుపీరియర్ లగ్జరీ రూములు, వరల్డ్ క్లబ్ రూములు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల, వివిధ బడ్జెట్‌లకు అనుగుణంగా ప్రయాణికులు తమకు నచ్చిన గదిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ హోటల్‌ లో ఆక్యుపెన్సీ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కరోనా మహమ్మారి ముందు ఇది సుమారు 90 శాతం వరకు ఉండేది. ఇప్పటికీ చాలా సందర్భాల్లో గదులు పూర్తిగా బుక్ అయిపోతాయి. దీనికి కారణం అందుబాటు ధరలు, సులభమైన సేవలు ఆకట్టుకునేలా ఉంటాయి.  ఇక్కడ చెక్ ఇన్ ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులు వేగంగా గదులను పొందగలుగుతారు. ఇది పెద్ద సంఖ్యలో వచ్చే టూరిస్టులకు ఈజీగా యక్సెస్ అందిస్తుంది. పెద్ద సంఖ్యలో గదులు, సరసమైన ధరలు, మంచి లొకేషన్‌ తో ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.

Read Also: వందేభారత్ సూపర్ హిట్.. ఏడాదిలో ఎన్నికోట్ల మంది ప్రయాణించారంటే?

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×