BigTV English

Jupiter Transit 2024: ఆగస్ట్ 28న మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి సంచారం.. ఈ రాశుల వారికి ధనలాభం

Jupiter Transit 2024: ఆగస్ట్ 28న మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి సంచారం.. ఈ రాశుల వారికి ధనలాభం

Jupiter Nakshatra Transit 2024: బృహస్పతి సంపద, ఆనందం, అదృష్టం, సంతానం, సద్గుణాలకు కారకంగా బావిస్తారు. బృహస్పతి ఆగస్టులో తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. బృహస్పతి ఆగస్ట్ 28 వ తేదీన మృగశిరా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. బృహస్పతి నక్షత్ర మార్పు ప్రభావం మేషం నుంచి మీన రాశి వరకు ఉంటుంది. బృహస్పతి నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలను ఇస్తుంది.


మూడు నెలల పాటు బృహస్పతి మృగశిర నక్షత్రంలో సంచరించనున్నాడు. దీంతో 23 నెలలు కొన్ని రాశుల వారికి సకల సౌభాగ్యాలు అందుతాయి. జీవితంలో కూడా ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.

మృగశిరా నక్షత్ర ప్రాముఖ్యత:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 27 నక్షత్రాల్లో మృగశిర నక్షత్రం ఐదవది. ఈ నక్షత్రం సగ భాగంలో మేష రాశిలో మిగిలిన సగభాగం మిథున రాశిలో ఉందని చెబుతారారు. మృగశిరా నక్షత్రంలో జన్మించిన వారు ప్రేమ, ఆప్యాయతను కలిగి ఉంటారు. అంతే కాకుండా చాలా నిజాయితీగా, తెలివిగా ఉంటారు. మృగశిరా నక్షత్రంలో పుట్టిన వారి ప్రవర్తన మర్యాద పూర్వకంగా ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడుగా చెబుతుంటారు. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పరిశోధనాత్మక స్వభావం కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు సరళమైన, సూత్రప్రాయమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మృగశిర నక్షత్రంలో గురు సంచారం వల్ల ఈ రాశులకు లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


వృషభ రాశి:
మృగశిరా నక్షత్రంలో బృహస్పతి సంచారం మేషరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో కూడా ఆనందం పొందుతారు. బంధు, మిత్రుల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు కూడా తొలగిపోయి ఆప్యాత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు వృత్తిలో పురోగతి లభిస్తుంది. అంతే కాకుండా ఉద్యోగాల కోసం గొప్ప అవకాశాలు కూడా వస్తాయి. ప్రమోషన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో ప్రతిష్ట, గౌరవం కూడా పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి:
బృహస్పతి సంచారం వల్ల సింహ రాశి వారి జీవితాల నుంచి అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు తమ వృత్తిలో పురోగతిని సాధించేందుకు అవకాశం ఉంది. ఆఫీసులో సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. దీంతో పాటు పనిలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు. కెరీర్‌లో అడ్డంకుల, డబ్బులు లేక కలిగే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా వస్తాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వివాహం కుదిరే అవకాశం కూడా ఉంది.

Also Read: సెప్టెంబర్‌లో ఈ రాశుల వారు ఏ పని ప్రారంభించినా సక్సెస్ అవుతారు

ధనస్సు రాశి:
బృహస్పతి సంచారం ధనస్సు రాశి వారికి అద్భుత ఫలితాలను ఇస్తుంది. నక్షత్రంలో మృగశిరా నక్షత్రంలో బృహస్పతి సంచారం వల్ల మీరు ప్రతి రంగంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సంపద బాగా పెరుగుతుంది. నక్షత్ర మార్పు కారణంగా జీవితంలో మూడు నెలల పాటు ఆనందం వెల్లివిరుస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×