BigTV English

Silver peacock: ఇంట్లో ఆ ప్రదేశంలో వెండి నెమలిని పెట్టండి చాలు, లక్ష్మీదేవి సంపద కురిపిస్తుంది

Silver peacock: ఇంట్లో ఆ ప్రదేశంలో వెండి నెమలిని పెట్టండి చాలు, లక్ష్మీదేవి సంపద కురిపిస్తుంది

ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తేనే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం వెండి నెమలిని ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఈ వెండి నెమలిని ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసుకోండి.


వెండి నెమలిని వాస్తు శాస్త్రం ప్రకారం శుభంగా భావిస్తారు. ఇది శక్తిని సూచించే లక్ష్మి దేవి, కార్తికేయుడితో ముడిపడి ఉంటుంది. వెండి నెమలి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంట్లో సానుకూలతను వ్యాపింప చేసేలా చేస్తుంది. ఇంట్లో సరైన స్థానంలో వెండి నెమలిని ఉంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయి. సంపద విపరీతంగా కలిసి వస్తుంది. ఆ ఇంట్లో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి.

శుక్ర గ్రహంతో అనుబంధం
వెండి నెమలి శుక్ర గ్రహంతో చంద్రునితో అనుబంధం కలిగి ఉంటుంది. శుక్రుడు ప్రేమకు, ఐశ్వర్యానికి కారకుడు. ఇక చంద్రుడు మనశ్శాంతికి కారకుడు. ఈ వెండి నెమలిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎంతో అందంగా కూడా కనిపిస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఈ వెండి నెమలిని పూజా స్థలంలో ఉంచాలి. ఇది కుటుంబంలో సామరస్యాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది.


ఆగ్నేయ దిశలో ఉంచాలి
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం వెండి నెమలిని ఆగ్నేయ దిశలో ఉంచడం అత్యంత శుభప్రదంగా చెబుతారు. ఈ దిశ సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. లివింగ్ రూమ్, పూజ మందిరము, ప్రధాన ద్వారం వద్ద ఈ వెండి నెమలిని ఉంచవచ్చు. నెమలి నోరు ఇంటి వైపు చూస్తున్నట్టు ఉండాలి. దీనివల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవహిస్తుంది. వాస్తు దోషాలను తగ్గిస్తుంది. లక్ష్మీదేవి అడుగుపెట్టేలా చేస్తుంది.

వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, కుటుంబంలో గొడవలు, అశాంతి వంటివి వస్తాయి. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఒక వెండి నెమలిని కొని ఇంట్లో పెట్టుకోండి. ఇది మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని మొత్తం గ్రహిస్తుంది. ఇంటి వాతావరణాన్ని కూడా పరిశుద్ధం చేస్తుంది.

వెండి నెమలి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. దీనిని ఆగ్నేయ దశలో ఉంచితే ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాగా కలిసి వస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవికి అర్పించిన పూలతో ఈ వెండి నెమలిని అలంకరిస్తే ఇంకా మంచిది. ఆ ఇంటికి అదృష్టం, ఆనందం విపరీతంగా వస్తాయి.

వెండి నెమలిని సంపదను మాత్రమే కాదు, కుటుంబ సంబంధాలను కూడా కాపాడుతుంది. లివింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్ లో ఈ వెండి నెమలిని ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. వారి మధ్య అపార్థాలను తొలగిస్తుంది. వెండిలోని మెరుపు, నెమలిలోని అందం ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తాయి.

పూజా స్థలంలో వెండి నెమలిని ఉంచితే ప్రతి రోజు దీపాలను దీపం వెలిగించి లక్ష్మీదేవి మంత్రాలను జపించండి. దీనివల్ల మీ జీవితం ఎంతో ఆనందంగా మారుతుంది.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×