Jyeshtha Amavasya: హిందూ ధర్మంలో ప్రతీ రోజుకి ఒక్కో విశేషం ఉంటుంది. అమావాస్యల్లో ముఖ్యమైనది జ్యేష్ట అమావాస్య. ఆ రోజుకున్న ఉన్న ప్రత్యేకతలు ఇన్నీఇన్నీకావు. చాంద్రమాన నెలలో చంద్రుడు కనిపించని రోజు. జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రాముఖ్యత ఉందని అంటున్నారు నిపుణులు.
బుధవారం అంటే జూన్ 25న జ్యేష్ఠ అమావాస్య రోజు. సూర్యుడు-చంద్రుడు ఒకే రాశిలోకి వస్తారు. ఇదే శుభ ఫలితమని అంటున్నారు. పితృ దేవతల ఆరాధన చాలా ముఖ్యమైంది. ఆ రోజు శని, గురు, సూర్యుడు ఒకే రాశిలోకి రానున్నారు. ఈ రోజున శని దేవుడికి ప్రత్యేకంగా తైలాభిషేకం, నువ్వులతో అభిషేకం చేస్తే మరింత మంచిది కూడా.
అమావాస్య ప్రధానంగా పితృదేవతలకు అంకితం చేయబడిన రోజుగా చెబుతారు. ఆ రోజు పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వస్తాయని చాలామంది బలంగా నమ్ముతారు. అందుకే పితృ దేవతలకు తర్పణాలు, పిండ ప్రదానం చేసి వారి ఆత్మతకు శాంతి చేకూర్చుతారు.
దానివల్ల వారి ఆశీస్సులు మనకు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. చంద్రుడు కనపడని రోజు కావడంతో అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అందుకే ఈ రోజు దుష్ట శక్తుల నుంచి రక్షణ కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.
ALSO READ: ఈ రాశుల్లో పుట్టిన అబ్బాయిలకు దేవకన్యలాంటి భార్యలు వస్తారు
వివిధ పంచాంగాల ప్రకారం జ్యేష్ఠ మాసంలో అమావాస్య జూన్ 24న సాయంత్రం 7 గంటలకు మొదలుకానుంది. జూన్ 25న సాయంత్రం 4 గంటలతో ముగియనుంది. తిథి ప్రకారం ఈ ఏడాది జ్యేష్ఠ అమావాస్య జూన్ 25 బుధవారం జరుపుకుంటారు. చంద్రుడు.. మనస్సు, భావోద్వేగాలకు కారకుడు.
అమావాస్య రోజున చంద్రుని ప్రభావం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొందరు మానసికంగా, అశాంతికి లోనవుతారు. అలాంటి వారు పూజలు చేస్తే కాస్త ఉపశమనం లభించనుంది. అమావాస్య అనేది ఆత్మ పరిశీలన చేసుకోవడానికి అనువైన సమయం. ధ్యానం, ఆధ్యాత్మిక అభ్యాసాలకు మంచిరోజుగా చెబుతారు.
ఆరోజు పూజలు, ఉపవాసాలు చేస్తే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతారు. కాళీకా దేవి, దుర్గామాట, చండీ, మహిషాసురవర్ధిని వంటి అమ్మవారిని దర్శించుకున్నా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
హిందు సంప్రదాయాల ప్రకారం అమావాస్య రోజు కొన్ని పనులు చేయకూడదని పదే పదే పెద్దలు చెబుతుంటారు. వివాహాలు, గృహప్రవేశం అస్సలు నిర్వహించరు. అలాగే కొత్త వ్యాపారాలకు దూరంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయరు. ఈ రోజున కోపం, ద్వేషం, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
జుట్టు కత్తిరించుకోవడం, క్షవరం చేసుకోవడం, గోర్లు కత్తిరించడం చేయకూడదని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నమాట. పగటి పూట, సూర్యాస్తమ సమయంలో నిద్రపోవడం మంచిది కాదని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు వీటిని చాలామంది ఫాలో అవుతారు. తమిళనాడులో అమావాస్య రోజు మంచి పనులు మొదలుపెడతారు. అక్కడి ప్రజలు ఈ రోజును శుభదినంగా భావిస్తుంటారని కొందరు చెబుతున్నారు.
సూచన- పైన సమాచారం కొందరు నిపుణులు, కొన్ని శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా చెబుతున్నాము. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఉండవన్న విషయం గుర్తించాలి. నమ్మక పోవడం అనేది మీ వ్యక్తిగత విషయం.