BigTV English

Vastu Tips In Telugu: మీ ఇంట్లో ఈ వస్తువులను ఉంచితే.. జరిగేది ఇదే!

Vastu Tips In Telugu: మీ ఇంట్లో ఈ వస్తువులను ఉంచితే.. జరిగేది ఇదే!
వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులు ఇంట్లో ఉంచడం వల్ల ఆ ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. ఒత్తిడితో కూడిన జీవితంలో ఇంట్లో ప్రశాంతత, ప్రేమ పూర్వక వాతావరణం కరువైపోతోంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా పెరుగుతున్నాయి.  మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచేస్తుంది. కాబట్టి ఇంటిలోకి సానుకూల శక్తిని తీసుకు వెళ్లడం ద్వారా మీరు ఇంటి వాతావరణాన్ని మార్చవచ్చు. ఇల్లు, ఇంటి సభ్యుల ప్రవర్తన శాంతియుతంగా ఉండేలా చేయవచ్చు. అందుకోసం మీరు కొన్ని వస్తువులను కచ్చితంగా ఇంట్లో ఉండేలా చూసుకోవాలి.


బుద్ధ విగ్రహం
బుద్ధుడి విగ్రహం శాంతిని, సంపూర్ణతను సూచిస్తుంది. అలాగే సామరస్యాన్ని తెచ్చిపెడుతుంది. మీ ఇంట్లో బుద్ధుని విగ్రహం ఉంచితే ఎంతో మంచిది. అతను ధ్యానం చేస్తున్నట్లు ఉన్న విగ్రహాన్ని గదిలో ఉంచితే ఆ ఇల్లంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. బుద్ధుడు చూడగానే నిశ్శబ్దంగా, ఆరోగ్యంగా, సానుకూలంగా కనిపిస్తాడు. అతని నుంచి వచ్చే శక్తి ఇల్లంతా వ్యాపిస్తుంది.

అద్దం
వాస్తులో అద్దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అద్దాన్ని ప్రతిబింబ మాధ్యమంగా చెప్పుకుంటారు. దీన్ని సరైన ప్రదేశంలో ఇంట్లో ఉంచితే సానుకూల శక్తి పెరుగుతుంది. అద్దాలను మీ తలుపులు లేదా మంచాలకు ఎదురుగా ఉంచకూడదు. అలా ఉంచితే ఆ అద్దం సానుకూల శక్తిని పీల్చేసుకుంటుంది. అలా కాకుండా సహజ కాంతిని ప్రతిబింబించే ప్రదేశాలలో ఉంచాలి. అంటే అద్దం పై వెలుగు పడేటట్టు ఉంచాలి. అలా పెడితే ఆ వెలుగు అద్దం నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మరింత కాంతివంతంగా గదిని మారుస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ ఇల్లు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుందని నమ్ముతారు.


మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ ను కేవలం సంపదకు మాత్రమే చిహ్నంగా భావిస్తారు. నిజానికి ఇది అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉండేలా చూస్తుంది. వాస్తు ప్రకారం ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని చెప్పుకుంటారు.  మనీ ప్లాంట్ ఉండే ఇల్లు శాంతితో ప్రేమతో నిండి ఉంటుందని అంటారు. మనీ ప్లాంట్‌ని ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లోని విషాలను, వ్యర్ధాలను గ్రహించి అది ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది మరింత ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడేలా దోహదం చేస్తుంది.

క్రిస్టల్ రాళ్లు
క్వార్జ్ లేదా క్లియర్ క్రిస్టల్ స్టోన్స్ మార్కెట్లో ఎన్నో అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా ఇంటిలో ప్రతికూల శక్తులను బయటికి పంపిస్తాయని చెప్పుకుంటారు. స్పష్టమైన క్రిస్టల్ స్టోన్స్ ను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే సానుకూల శక్తి పెరుగుతుంది. మీ ఇంట్లో శాంతి, ప్రేమ వంటివి పెరుగుతాయి. ఇలాంటి క్రిస్టల్ స్టోన్స్ ను మీ ఇంటిలోనే లివింగ్ రూమ్ లో ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ పరిసరాలను ప్రశాంతంగా ఉంచుతాయి.

విండ్ చైమ్
గాలికి ఊగుతూ చిన్నచిన్న శబ్దాలు చేసే విండ్ చైమ్‌లు ఇంట్లో ఉండడం వల్ల ఎంతో మేలు చేస్తాయి. విండ్ చైమ్ నుంచి వచ్చే సున్నితమైన శబ్దాలు ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకొస్తుంది. కిటికీలు, తలుపుల దగ్గర ఈ విండ్ చైమ్ వేలాడదీయడం వల్ల తేలికపాటి గాలికే అవి ఊగి ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తాయి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×