AP Pensions 2024: ఏపీలోని సామాజిక పింఛన్ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పింఛన్ నగదును పెంచి పంపిణీ చేస్తుండగా, తాజాగా ప్రకటించిన శుభవార్తతో పెన్షన్ దారులకు మరో వెసులుబాటు కల్పించినట్లు భావించవచ్చు.
ఏపీ ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ నగదు పంపిణీ పై వరాల జల్లు కురిపించారు. తాను పెన్షన్ దారులకు హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, పెన్షన్ నగదును పెంచి పంపిణీ చేశారు. వృద్ధాప్య, వితంతు పెన్షన్ దారులకు రూ.3 వేలు పింఛన్ నగదు గతంలో అందిస్తుండగా, అందుకు రూ.1000 లు పెంచిన ప్రభుత్వం, 3 నెలల యొక్క అదనంగా రూ.1000 చొప్పున చొప్పున మొత్తం రూ. 7000 అందించారు.
ఇక వికలాంగులకు రూ.3000 పెన్షన్ నగదు పంపిణీ చేస్తుండగా, వారికి ఏకంగా రూ.6000లు ప్రభుత్వం పంపిణీ చేసింది. సచివాలయ సిబ్బందిని ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్ దారుల గృహాలకు పంపించి ఈ నగదును పంపిణీ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వము పెన్షన్ దారులకు మరో వెసులుబాటు సైతం కల్పించడం విశేషం.
గతంలో పెన్షన్ నగదును రెండు నెలల పాటు వరుసగా తీసుకోని పింఛన్ దారునికి నగదు చెల్లించడంలో ఇబ్బందులు ఉండేవి. అటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ప్రస్తుతం 2 నెలల పాటు పింఛన్ తీసుకోకపోయినా, 3 నెలలో ఒకేసారి మొత్తం చెల్లించాలని నిర్ణయించింది. అంటే వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకొని పింఛన్ దారునికి మూడో నెలలో 3 నెలలకు సంబంధించిన నగదును సచివాలయ సిబ్బంది అందజేస్తారు.
Also Read: Today Horoscope: నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. !
అంతేకాకుండా పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే భార్యకు మరుసటి నెలలోనే వితంతు పింఛన్ మంజూరయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తమకు ఇంతటి వెసులుబాటు కల్పించడంపై పెన్షన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, వితంతువులు తమకు కల్పించిన వెసులుబాటుపట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో పెన్షన్ దారులకు ప్రభుత్వం వెసులుబాటు
రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఒకేసారి మొత్తం చెల్లించాలని నిర్ణయం
పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే భార్యకు మరుసటి నెలలో వితంతు పెన్షన్ మంజూరు
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం… pic.twitter.com/yWA6evX5JJ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 21, 2024