OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే చెవి కోసుకునే అభిమానులు చాలామంది ఉన్నారు. ఈ సినిమాలను కుర్చీలకు అతుక్కొని కల్లార్పకుండా చూస్తూ థ్రిల్ అవుతారు. అటువంటి థ్రిల్ ఇచ్చే ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు “స్ట్రా డాగ్స్” (Straw dogs) ఈ మూవీలో ప్రజెంట్ లవర్ తో హ్యాపీగా ఉన్న హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో వచ్చే సమస్యలు ఎలా ఎదుర్కొందో మూవీ స్టోరీలో తెలుసుకుందాం. ఈ సస్పెన్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక రైటర్ గా కథ రాస్తూ ఉంటాడు. ఒకసారి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లి కథలు రాయాలనుకుంటాడు. ఈ విషయం హీరోయిన్ కి చెప్తాడు. హీరోయిన్ కథలు రాయడానికి మా ఊరికి వెళ్దాం అంటుంది. హీరో కూడా ఓకే అనడంతో, ఇద్దరూ కలిసి హీరోయిన్ సొంత ఊరికి వెళ్తారు. అక్కడ హీరోయిన్ ను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చార్లీ కలుస్తాడు. మీ ఇల్లు రిపేర్ ఉందని దానిని మేము రిపేర్ చేస్తామంటూ చెప్తాడు. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో అన్ని విషయాలు చెబుతుంది. ఒకప్పుడు ఇతనిని నేను ప్రేమించానని, అతని ప్రవర్తన నచ్చక ఆ తర్వాత విడిపోయానని చెప్తుంది. హీరో కూడా ఆమె మాటలను నమ్ముతాడు. అయితే ఒకరోజు చార్లీ హీరోని వేటకు ఆహ్వానిస్తాడు. హీరో సరదాగా ఉంటుందని అందరితో కలిసి వేటకు వెళ్తాడు. చార్లీ మధ్యలోనే హీరోయిన్ ఇంటికి వస్తాడు. నన్ను వదిలి వెళ్తావా అంటూ ఆమెపై ఆఘాయిత్యం చేస్తాడు. అతడు చేయడమే కాకుండా ఫ్రెండ్ తో కూడా చేపిస్తాడు.
ఈ విషయం హీరోకి చెప్తే ఏమవుతుందోనని భయపడి హీరోయిన్ సైలెంట్ గా ఉంటుంది. హీరోయిన్ చార్లీ పై చాలా కోపంగా ఉంటుంది. చార్లీ ప్రవర్తన హీరోకి నచ్చకపోవడంతో మధ్యలోనే వాళ్ళని పని ఆపి వెళ్లిపోమంటాడు. ఆ తర్వాత హీరో ను చార్లీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. చివరికి హీరోయిన్ కి జరిగిన అవమానాన్ని హీరో తెలుసుకుంటాడా? ఆ ఇంట్లో హీరో స్టోరీలు రాయగలుగుతాడా? చార్లీ కి హీరో బుద్ధి చెప్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “స్ట్రా డాగ్స్” (Straw dogs) సస్పెన్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇస్టపడే మూవీ లవర్స్ కు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. మరెందుకు ఆలశ్యం ఈ మూవీపై ఓ లుక్ వేయండి.