BigTV English

Tirumala : మోకాళ్ల నొప్పులా..? తిరుమలలోని ఈ అద్బుతం గురించి తెలుసుకోవాల్సిందే..!

Tirumala : మోకాళ్ల నొప్పులా..? తిరుమలలోని ఈ అద్బుతం గురించి తెలుసుకోవాల్సిందే..!

Tirumala : మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? ఎన్ని మెడిసిన్స్‌ వాడినా ఫలితం లేకుండా పోతుందా..?  నడవలేని పరిస్థితుల్లో మీరు పెయిన్‌ను  భరిస్తున్నారా..? అయితే మోకాళ్ల నొప్పులను మటు మాయం చేసే అద్బుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేల సంవత్సరాలుగా ఎంతో మంది నమ్ముతూ పాటిస్తూ నొప్పులను దూరం చేసుకున్న వైనం గురించి ఈ కథనంలో  తెలుసుకుందాం.


ఈ కాలంలో ఎంతో మందిని బాధిస్తున్న ఆరోగ్య సమస్యలో మోకాళ్ల నొప్పులు కూడా ఉన్నాయి. కల్తీ ఫుడ్‌..తినడం వల్లనో లేక కెమికల్స్‌ వాడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్లనే కానీ  చిన్న వయసులోనే ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. అలాంటి రోగాలలో చాలా మందిని పట్టిపీడుస్తున్న జబ్బు మోకాళ్ల నొప్పి. మోకాళ్లలో గుజ్జు అరిగిపోవడం వల్ల ఈ పెయిన్‌ వస్తుందని డాక్టర్లు చెప్తుంటారు. అయితే ఈ పెయిన్‌ వచ్చిన వారి పరిస్థితి కూర్చుంటే లేవలేరు.. లేస్తే కూర్చోలేరు అన్న చందంగా తయారవుతుంది. ఇక  ఎమర్జెన్సీ టైంలో వీరు ఎక్కడికైనా నడవాల్సి వస్తే వీరి పరిస్థితి అగమ్యగోచరం.

ఇప్పటి వరకు అధునిక  వైద్యశాస్త్రం ఎన్ని మెడిసిన్స్‌  కనుగొన్నా అవి కేవలం ఉపశమనం మాత్రమే ఇస్తున్నాయి తప్పా శాశ్వత పరిష్కారం చూపడం లేదు. దీంతో జనాల జోబులు ఖాళీ అవుతున్నాయి  తప్పా రోగం నయం అవ్వడం లేదు. ఇక ఇదే అదనుగా ఎంతో మంది డాక్టర్లమని.. అనువంశిక ఆయుర్వేద నిపుణులమని చెప్పుకుంటూ ప్రజలకు పెయిన్‌ కిల్లర్స్‌ ఇచ్చి మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు కానీ రోగం మాత్రం నయం అయిన దాఖలాలు అంతంత మాత్రమే.  అయితే వేల సంవత్సరాలుగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎంతో మంది భక్తులు తమ మోకాళ్ల నొప్పులను ఉచితంగా తగ్గించుకుంటున్నారు. అదేక్కడో కాదు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండల్లోనే.


అవును మీరు చదువుతున్నది నిజమే.. తిరుపతి  నుంచి తిరుమలకు  అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తుంటే.. తలయేరు గుండు అనే పెద్ద రాయి కనిపిస్తుంది. ఈ రాయికి ఎన్నో మహిమలు ఉన్నాయని కొండ మీదకు వెళ్లే భక్తులు నమ్ముతుంటారు. అందులో మోకాళ్ల నొప్పులు తగ్గించే అద్బుతం ఈ రాయిలో ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే తిరుమలకు వెళ్లే భక్తులు చాలా మంది తమ మోకాళ్లను ఈ తలయేరు గుండుకు తాకిస్తుంటారు. అలా తాకించడం వల్ల మోకాళ్ల నొప్పులు మటుమాయం అవుతాయిన నమ్ముతారు. అయితే ఈ నమ్మకం ఈ మధ్యన వచ్చింది కాదు. వేల సంవత్సరాలుగా అలిపిరి నడకమార్గంలో వెళ్తున్న  భక్తులు ఈ తలయేరు గుండుకు తమ మోకాళ్లను తాకించి నొప్పులు తగ్గించుకుంటున్నారట. అయితే వేల సంవత్సరాలుగా భక్తులు తమ మోకాళ్లను తలయేరు గుండుకు తాకించడం వల్ల మోకాళ్ల అచ్చులు ఆ గుండుకు స్పష్టంగా కనిపిస్తున్నాయట. ఎంతో మహిమాన్వితమైన రాయిగా ఈ తలయేరు గుండును భక్తులు బావిస్తారట.

మరి ఇంకెందుకు ఆలస్యం మీలో ఎవరికైనా మోకాళ్ల నొప్పులు ఉంటే వెంటనే తిరుమలకు పయణం అవ్వండి తలయేరు గుండకు మీ మోకాళ్లను తాకించి నొప్పులను తగ్గించుకోండి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు

 

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×