E-Paper
Advertisement

MI vs CSK : ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ను ర్యాగింగ్ చేసిన లేడి.. ఫోటో వైరల్

MI vs CSK : ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ను ర్యాగింగ్ చేసిన లేడి.. ఫోటో వైరల్
Advertisement

MI vs CSK :  సాధారణంగా క్రికెట్ లో ఒక టీమ్ అన్నా.. ఆ టీమ్ ఆటగాళ్లు అన్న కొందరికీ చాలా ఇష్టం. కొంత మంది మాత్రం ఆ టీమ్ ఆటగాళ్లను ఇష్టపడుతూ.. పక్క టీమ్ వాళ్లను హేళన చేస్తుంటారు. ప్రస్తుతం ఐపీఎల్ లో అలాంటి ఘటనలే ఎక్కువగా చోటు చేసుకున్నాయి. అంతకు ముందు తమిళనాడులో సచిన్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఆర్సీబీ, సీఎస్కే అభిమానులు కొట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోCSK టీ షర్టు వేసుకున్నటువంటి మహిళా ముంబై ఇండియన్ ఫ్యాన్స్ ని రాగింగ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

క్రికెట్ లో లేడీ అభిమానులు ఉంటారు.. కానీ ఇలాంటి అభిమానులను అస్సలు చూడలేదని మరికొందరూ కామెంట్స్ చేయడం విశేషం. వాస్తవానికి ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలిస్తే.. ఆ లేడీ ముంబై ఇండియన్ అభిమానిని ఎలా కామెంట్ చేసిందని ఆశ్చర్యపోవడం విశేషం. చెన్నై జట్టు వరుస ఓటములతో పేలవ ప్రదర్శన చేస్తోంది. ముంబై జట్టు కూడా వరుస ఓటమిలు.. మరోవైపు రోహిత్ శర్మ వైఫల్యం చెందడంతో ఈ సీజన్ లో ముంబై అభిమానుల బాధ అంతా ఇంతా కాదు కానీ ఇప్పుడు ముంబై దూసుకెళ్తోంది. రోహిత్ శర్మ కూడా చెలరేగిపోతున్నాడు. ఆదివారం భారీ ఇన్నింగ్స్ తో అభిమానులను ఉర్రూతలూగించాడు.  రోహిత్ కి తోడు సూర్యకుమార్ సైతం రెచ్చిపోవడంతో వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చిత్తుగా ఓడించి నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ముంబై ఇండియన్స్.

Advertisement

ఆలస్యంగా జోరందుకున్నటువంటి ముంబై ఇండియన్స్ చెన్నై విజయంతో హ్యాట్రిక్ విజయం సాధించింది. బంతితో చెన్నైని కట్టడి చేసి.. బ్యాట్ తో మెరుపులు మెరిపించింది. మొదట చెన్నై 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. శివమ్ దూబె 32 బంతుల్లో 50 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 53 నాటౌట్ గా నిలిచాడు. ప్రారంభంలో ఆయుష్ 32 పరుగులు చేశాడు. బుమ్రా 2 వికెట్లు తీసారు. రోహిత్ శర్మ 76 పరుగులు చేయడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ కూడా చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 30 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముంబై కేవలం 15.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

అంతకు ముందు చెన్నై ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలైంది. రచిన్ రవీంద్ర 5, షేక్ రషీద్ 19, దూకుడుగా ఆడలేకపోవడంతో 3 ఓవర్లకు 16 పరుగులే చేయగలిగింది. మూడో ఓవర్లలో చెన్నై కి తొలి బౌండరీ లభించింది. రచిన్ ను అశ్వని కుమార్ ఔట్ చేయడంతో చెన్నై కి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సమయంలో ఆయుష్ మాత్రే అదరగొట్టాడు. అశ్వనికుమార్ బౌలింగ్ లో అతడు వరుసగా 4, 6, 6 అందుకున్నాడు. జడేజా 53 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో చెన్నై స్కోర్ 176 పరుగులు అయ్యాయి. వాటిని ముంబై బ్యాటర్లు అలవకగా ఛేదించడం విశేషం. అయితే ముంబై ఫ్యాన్ ని చెన్నై లేడీ అభిమాని ర్యాగింగ్ చేయడమే ఇక్కడ ఆసక్తికర విషయం అని చెప్పవచ్చు.

Related News

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

Big Stories

Advertisement
×