BigTV English

Lord Ayodhya rama: అయోధ్య రాముడికి తెలంగాణతో ఉన్న రిలేషన్‌ ఏంటో తెలుసా..? ఎవరికీ తెలియని శ్రీరాముని రహస్యాలు

Lord Ayodhya rama: అయోధ్య రాముడికి తెలంగాణతో ఉన్న రిలేషన్‌ ఏంటో తెలుసా..? ఎవరికీ తెలియని శ్రీరాముని రహస్యాలు

Lord Ayodhya rama: అయోధ్య రాముడు తెలంగాణ రాముడని మీకు తెలుసా..? శ్రీరాముడి జన్మభూమి ఎక్కడో ఉన్నా..? కర్మభూమి మాత్రం తెలంగాణ గడ్డమీదేనని మీకు తెలుసా…? కోదండ రాముడు తెలుగులోనూ అనర్గళంగా మాట్లాడేవారని ఎంత మందికి తెలుసు..? గోదావరి సాక్షిగా రామగుండం ఏర్పాటుకు రాముడే కారణం అన్న విషయం మీకు తెలుసా..?


శ్రీరాముడి జన్మభూమి అయోద్య అయినప్పటికీ ఆయన కర్మభూమి తెలంగాణేనట. ఎందుకంటే రాముడు ఇక్కడే పర్ణశాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడి అడవులలో సంచరించారు. ఇక్కడి కంద మూలాలు తిన్నాడు. ఇక్కడి తోటల్లో సీతా సమేతుడై విహరించాడు. ఇక్కడి జలాశయాల్లో స్నానం చేశాడు.  ఈ నేల సాక్షిగా సంధ్యా వందన విధుల్లో గోదావరి తీరే అని సంకల్పం చేసుకున్నాడు. అందుకే తెలంగాణ ప్రజలు రాముడిని తమ వాడిగా చేసుకున్నాడు. రామన్నా అని ఆత్మీయంగా పిలుచుకున్నారు. ఊరికో గుడి కట్టుకున్నారు. ఆదికావ్యంలో లేని కథలు, మూల రామాయణం ప్రస్తావించని ఘట్టాలు గురించి తెలంగాణ స్థల పురాణాల్లో అనేకం అని చెప్పవచ్చు. అయితే రాముడు తెలంగాణను కర్మభూమిగా మలుచుకోవడమే కాకుండా..? తెలుగు కూడా మాట్లాడేవారట.

శ్రీరాముడు నిలువెత్తు ధర్మ స్వరూపుడు కాబట్టే భద్రుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని భద్రగిరి మీద నిలిచాడు. భద్రాద్రి రాముడిగా చరిత్రలో నిలిచిపోయారు. గుడి కట్టిన గోపన్నకు గుండెల్లో స్థానం ఇచ్చాడు. ఆ ప్రేమతోనే గోల్కోండ సుల్తానుల నుంచి రామదాసును విడిపించుకున్నాడు. లేడీ రూపంలో వచ్చిన  మాయావి మారీచుడిని వధించింది తెలంగాణలోని జీడికల్ దగ్గర ఉన్న వీరాచలంలో అని శాసనాలు ఉన్నాయి. అక్కడే సంధ్యా వందనం చేసుకోవడానికి నీరు దొరక్క ఒక బండను తన బొటనవేలుతో నొక్కగా పాతాళ గంగమ్మ పొంగుకొచ్చింది. ఆ నీటితోనే సూర్యదేవుడికి ఆర్ఘ్యం ఇచ్చాడు. అదే ఇప్పటి వీరాచల క్షేత్రం. ఇక రామగిరికోటకు రాముడికి విడదీయరాని అనుబంధం ఉంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం, బేగంపేట గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది రామగిరి ఫోర్టు. ఈ రామగిరి ప్రాంతంలోనే సీతా, లక్ష్మణ సమేతుడైన రాముడు అరణ్యవాసంలో సంచరించినట్టు.. ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్టించినట్టు స్థల పురాణం చెప్తుంది. ఇక రావణ వద తర్వాత బ్రహ్మ హత్యా పాతకాన్ని  వదిలించుకోవడానికి నేటి కీసర గుట్టలోనూ ఒక శివలింగాన్ని ప్రతిష్టించినట్టు స్థల పురాణంలో ఉంది.


ఇక సీతమ్మకు తెలంగాణ మట్టి మీద ప్రత్యేకమైన ప్రేమ. రాముడు నడిచిన జాడలు, సీతమ్మ స్నానం ఆడిన కుంటలు తెలంగాణలో అనేకం. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న అమ్మపల్లి శ్రీ సీతారామస్వామి క్షేత్రం రాష్ట్రంలోనే అతి పురాతనమైన రామాలయం అని చెప్తుంటారు. ఇక్కడ రాముడు ఏకశిలా మూర్తి. అరణ్యవాసంలో శ్రీరాముడు భద్రాద్రి నుంచి ఆలేరు, జీడికల్లు మీదుగా అమ్మపల్లికి వచ్చాడని ఇక్కడే విశ్రాంతి తీసుకుని ఒంటిమిట్టకు బయలు దేరాడని చెప్తుంటారు.

రామగుండం పట్టణానికి ఆ పేరు రావడానికి ఒక ప్రత్యేకత ఉంది. వనవాసం సమయంలో గోదావరి తీరంలో పయనిస్తూ అలిసిపోయిన సీతా, రామ, లక్ష్మణులు ఒక గుట్ట దగ్గర సేద తీరారు. ఆ ప్రాంతం సీతారాములకు బాగా నచ్చింది అక్కడే 108 రోజులు విడిది చేశారు. నీటి కోసం అక్కడ రోజుకొక గుండం తవ్వారు అవే నేటి 108 గుండాలని స్థానికుల కథనం. ఇలా అన్నిగుండాలను కలిపి రాముని గుండాలు అని పిలచేవారని అది కాల క్రమంలో రామగుండంగా మారిపోయిందంటారు.

ఇక లవకుశులు పుట్టింది కూడా తెలంగాణలోనే అనేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం జనగామ జిల్లా  పాలకుర్తి సమీసంలోని వల్మిడి గ్రామమే మహర్షి వాల్మికి జన్మస్థలం అంటుంటారు. ప్రస్తుతం సీతారామచంద్రస్వామి ఆలయం ఉన్న స్థలమే వాల్మికి ఆశ్రమం అని చెప్తారు. ఆ ప్రకారంగా సీతమ్మ తల్లి లవకుశలకు జన్మనిచ్చిన ప్రాంతం కూడా ఇదే. వల్మిడి అసలు పేరు వాల్మికీపురం. సమీపంలో వాల్మికీ తపస్సు ఆచరించిన ప్రాంతాన్ని మునుల గుట్ట అంటారు.   ఇక సీతారామలక్ష్మణులు కూడా తెలుగు నేర్చుకున్నారని తెలుగు అనర్గళంగా మాట్లాడేవాడని అంటారు. అయితే దీనిపై పురాతన గ్రంథాలలో ఎలాంటి సాక్ష్యాలు లేవు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×