Father Wealth: తండ్రికి కోట్ల ఐశ్వర్యాన్ని తీసుకువచ్చే కూతుర్లు ఎవరో తెలుసా? వారు ఏ తేదీలలో పుడతారో తెలుసా..? న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీలలో పుట్టిన కూతుర్లు తమ తండ్రుల జీవితాలను మార్చేస్తారో తెలుసా..? వారి పుట్టకతోనే తమ తండ్రులు జీవితాలు అమాంతం అభివృద్ది పథంలో పరుగెత్తించే కూతుర్లు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
పుట్టుకతోనే మహరాణి యోగంతో పుట్టే అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు అష్టైశ్వర్యాలు తీసుకొస్తారు. అలాంటి వారు ఏ తేదీలలో పుడతారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకటో నెంబర్ అమ్మాయిలు: ఏ నెలలోనైనా ఒకటి, పది, పందొమ్మిది, ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన అమ్మాయిలే ఒకటో నెంబర్ అమ్మాయిలు. వీరు తమ తండ్రి ప్రతిష్టను పెంచుతారు. ఆమె ధైర్యంగా ఉండటమే కాకుండా తండ్రికి ధైర్యాని ఇస్తారు. తండ్రి గౌరవం కోసం ఉద్యోగ రంగా ఎదిగేందుకు కృష్టి చేసి గోల్ రీచ్ అవుతారు.
రెండవ నెంబర్ అమ్మాయిలు: ఏ నెలలోనైనా రెండు పదకొండు, ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టిన అమ్మాయిలను రెండవ నెంబర్ అమ్మాయిలు అంటారు. వీరి మానసిక స్థితి తమ తండ్రి మనఃశాంతిపై ప్రభావం చూపిస్తాయి. ఆఎమ సంతోషంగా ఉంటే తండ్రి జీవితం స్థిరంగా కొనసాగుతుంది.
మూడవ నెంబర్ అమ్మాయిలు: ఏ నెలలోనైనా మూడు, పన్నెండు, ఇరవై ఒకటి, ముప్పై తేదీలలతో పుట్టిన కూతుర్లను మూడో నెంబర్ అమ్మాయిలు అంటారు. వీరు తమ తండ్రికి జ్ఞాన మార్గదర్శకుల వంటి వారు. ఆమె అభివృద్దితో తండ్రి జీవితం ఎంతో అభివృద్ది చెందుతుంది. ఈ నెంబర్ లో పుట్టిన కూతుర్లు పుట్టడానికి తండ్రి జీవితం ఒకలాగా ఉంటే వీరు పుట్టిన తర్వాత ఆ తండ్రి జీవితం ఐశ్వర్యంతో తులతూగుతుంది.
నాలుగో నెంబర్ అమ్మాయిలు: ఏ నెలలోనైనా నాలుగు, పదమూడు, ఇరవై రెండు ముఫ్పై ఒకటి తారీఖుల్లో పుట్టిన అమ్మాయిలను నాలుగో నెంబర్ అమ్మాయిలు అంటారు. వీరు తమ తండ్రి జీవితంలో అనూహ్యమైన మార్పులను తీసుకువస్తారు. అలాగే ఈ కూతుర్ల భావోద్వేగాలు ఆ తండ్రుల ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి.
అయిదవ నెంబర్ అమ్మాయిలు: ఏ నెలలోనైనా ఐదు, పద్నాలుగు, ఇరవై మూడు తేదీలలో పుట్టిన అమ్మాయిలను ఐదవ నెంబర్ అమ్మాయిలు అంటారు. వీరు తమ తండ్రుల నిర్ణయాలలో సహాయం చేస్తారు. వీరికి స్వేచ్చ ఇస్తే తండ్రికి ఆర్థిక లాభాలు,వ్యాపార విజయాలు అందిస్తారు.
ఆరవ నెంబర్ అమ్మాయిలు: ఏ నెలలోనైనా ఆరు, పదిహేను, ఇరవై నాలుగు తేదీలలో పుట్టిన కూతర్లను ఆరవ నెంబర్ అమ్మాయిలు అంటారు. వీరు తమ తండ్రికి ఇంట్లో గృహలక్ష్మిలా వ్యవహరిస్తారు. తండ్రి గౌరవం రెట్టింపు చేస్తారు. అలాగే ఆ కూతురుకు తండ్రి ఎంత గౌరవం ఇస్తే ఆ తండ్రి జీవితం అంత వైభవంగా మారుతుంది.
ఏడవ నెంబర్ అమ్మాయిలు: ఏ నెలలోనైనా ఏడు, పదహారు, ఇరవై అయిదు డేట్ లలో పుట్టిన అమ్మాయిలను ఏడవ నెంబర్ అమ్మాయిలు అంటారు. వీరు ఆధ్యాత్మిక మార్గంలో తమ తండ్రికి మార్గనిర్దేశం చేస్తారు. ఆ తండ్రి విజయంలో ఈ కూతుర్లు మౌనంగా విజయాలను అందిస్తారు. వారి జీవితంలో అనూహ్యమైన మార్పులను తీసుకొస్తారు.
ఎనిమిదో నెంబర్ అమ్మాయిలు: ఏ నెలలోనైనా ఎనిమిది, పదిహేడు, ఇరవై ఆరు తేదీలలో పుట్టిన కూతుర్లను ఎనిమిదో నెంబర్ అమ్మాయిలు అంటారు. వీరు తమ తండ్రికి ఓర్పు, స్థిరత్వాన్ని అందిస్తారు. ఆమె కష్టపడితే తన తండ్రి జీవితం కూడా నెమ్మదిగా సంతోషంగా సాగుతుంది. తండ్రి మానసింకంగా బలంగా మారేందుకు ఈ నెంబర్లు కూతుర్లు సహయపడతారు.
తొమ్మిదవ నెంబర్ అమ్మాయిలు: ఏ నెలలోనైనా తొమ్మిది, పద్దెనిమిది, ఇరవై ఏడు తేదీలలో పుట్టిన అమ్మాయిలను తొమ్మిదవ నెంబర్ అమ్మాయిలు అంటారు. వీరు తమ తండ్రికి అన్ని విధాలుగా రక్షణగా నిలుస్తారు. ఈ నెంబర్ లో పుట్టిన కూతుర్లు శక్తివంతంగా ఉంటే ఆ తండ్రి శారీరకంగా ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్ టీవీ సొంతంగా క్రియేట్ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు