BigTV English

TET Exam: తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది..

TET Exam: తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది..

TET Exam: తెలంగాణ టెట్ – 2025 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజైంది. జూన్ 18 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ జరగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రోజూ రెండు సెషన్ లలో ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 9 నుంచి హాల్ టెకెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. ఈ సారి టెట్ ఎగ్జామ్ కు 1,83,653 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 


అఫీషియల్ వెబ్ సైట్: https://tgtet.aptonline.in/tgtet/

ఐదో తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులకు పేపర్ 1.. ఆరో తరగతి, ఆపై బోధించాలనుకునే అభ్యర్థులకు పేపర్ 2 పరీక్షను నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్ లు ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజీల్లో ఉండగా, కొన్ని సబ్జెక్టులకు హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం మాధ్యమాలు కూడా అందుబాటులో ఉంటాయి.


ALSO READ: ISRO Notification: అద్భుత అవకాశం.. ఇస్రోలో ఉద్యోగాలు, లైఫ్ సెట్ భయ్యా

పేపర్-2 విభాగంలో మ్యాథ్స్, సైన్స్ ఎగ్జామ్స్ తో ప్రారంభమయ్యే ఈ ఎగ్జామ్స్ వరుసగా 16 సెషనల్లో జరగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. జూన్ 30న మైనారిటీ భాషల్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ తో ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వనున్నాయి. జిల్లాల వారీగా కేంద్రాలు, సంబంధిత సబ్జెక్టులు, ఎగ్జామ్ డేట్స్ వివరాలు షెడ్యూల్ లో ప్రభుత్వం పేర్కొంది. నిజామాబాద్, జగిత్యాల, పటాన్ చెరు, సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల, మంచిర్యాల, ములుగు, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.  త్వరలోనే పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ విడుదల చేస్తామని.. అఫీషియల్ వెబ్ సైటులో డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. అభ్యర్థులు షెడ్యూల్ కి అనుగుణంగా తేదీలు గమనించి ఎగ్జామ్స్ కి సిద్ధమవ్వాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.

ALSO READ: ఐఏఎఫ్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు

Related News

Bc Bill: సడన్‌గా రాజకీయ పార్టీలకు బీసీలపై ప్రేమ దేనికి?

Birth Certificate: ఇదెక్కడి ఘోరం.. బర్త్ సర్టిఫికెట్‌కు అప్లై చేస్తే డెత్ సర్టిఫికెట్..?

Ponnam Prabhakar: హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఏ ప్యాకేజ్ తీసుకొచ్చారు

Srushti Fertility IVF Scam: రూ.20 కోట్లు.. 80 మంది పిల్లలు.. నమ్రత కేసులో సంచలనాలు

Rain Alert: మరి కాసేపట్లో భారీ వర్షం.. త్వరగా ఆఫీసులకు చేరుకోండి, లేకపోతే…

Telangana Congress: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Big Stories

×