BigTV English

Lakshmi Devi : లక్ష్మీదేవికి ఇరువైపులా ఏనుగులు ఎందుకు ఉంటాయి

Lakshmi Devi : లక్ష్మీదేవికి ఇరువైపులా ఏనుగులు ఎందుకు ఉంటాయి

Lakshmi Devi : సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి అటు ఇటూ కదలుతూ ఉంటుంది. తాను నిలకడలేని దానిని అని చెప్పడమే లక్ష్మీదేవి తామరపూవులో కొలువై ఉండటానికి అర్ధం. ఇరువైపులా ఏనుగులు ఉండటానికి మరో అర్థం ఉంది. ఒక ఏనుగు మమకారాన్ని సూచిస్తే..మరో ఏనుగు మదానికి ప్రతీక. సంపదంతా మమకారంతో ఉంటుంది. అలాగే సంపద రాగానే మదం పుడుతుంది. తాము అలాంటి వాళ్లు కాదని ఎంత చెప్పినా వారిలో మదం ఉంటుంది. కొంతమంది సందర్భాన్ని బట్టి మదాన్ని బయటపెడుతుంటారు. ఒకప్పుడు డబ్బు లేక


ధనబలం గజ బలం లాంటిదని అర్ధం చేసుకోమని చెప్పడమే పరమార్థం. లక్ష్మీదేవి చంచలత్వాన్ని తెలియ చెప్పే ఉద్దేశం కనిపిస్తుంటుంది. నీటిలో ఉన్న కలువ పువ్వును ఆసనంగా చేసుకోవడంఉద్దేశం కూడా అదే. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. సిరిసంపదలకు ప్రతిరూపమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి అనేక రకాల పూజలు పరిహారాలు చేయాల్సి ఉంటుంది

లక్ష్మీదేవి ఫోటో తూర్పు దిశగా ఉండేలా ఉంచి పూజించటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన ఇంట్లో ఎల్లప్పుడూ సిరిసంపదలకు లోటు ఉండదు. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేయటం వల్ల కూడా ఆ దేవి అనుగ్రహం పొందవచ్చు. శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసుకొని పువ్వులతో అందంగా అలంకరించి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహానికి తామర పువ్వులు సమర్పించి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం కలుగుతుంది.


Related News

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×