E-Paper
Advertisement

Swapna Shastra: కలలో రైలు కనిపిస్తే ఏం అవుతోంది.. కలల శాస్త్రం ఏం చెబుతోంది..?

Swapna Shastra: కలలో రైలు కనిపిస్తే ఏం అవుతోంది.. కలల శాస్త్రం ఏం చెబుతోంది..?
Advertisement

Swapna Shastra: ప్రతీ ఒక్కరు రాత్రిపూట కలలు కనడం సర్వసాధారణం కొన్ని కలలు అద్భుతంగా ఉంటాయి. ఇవి తెల్లవారుజామున లేచి తలచుకున్న ఆనందాన్ని ఇస్తాయి. మరికొన్ని సార్లు వచ్చే కలలు నిద్రకు భంగం కలిగిస్తుంటాయి. అయితే తరచూ ఇలాంటి కలలు రావడం సర్వసాధారణమే అయినా కూడా.. కలలు కూడా సూచనలు ఇస్తుంటాయి. కలలో కనిపించే ప్రతీ వస్తువులకు ఓ సూచన ఉంటుందట. స్వప్న శాస్త్రంలో కొన్ని విషయాలకు కూడా మంచి అర్థాలు ఉంటాయి. అయితే కలలో రైలులో ప్రయాణించినట్లు కనిపిస్తే ఏం అవుతుందో చాలా మందికి తెలియదు. అయితే రైలుకు సంబంధించిన కలలు వస్తే ఏం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రైలులో ప్రయాణం..

Advertisement

కలలో రైలులో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తే అది శుభ సంకేతం అని శాస్త్రం చెబుతుంది. పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులను పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి. అన్ని పనుల్లోను విజయం పొందవచ్చు. ఇది కాకుండా, డబ్బు ఎక్కడైనా నిలిచిపోయినట్లయితే దానిని తిరిగి పొందవచ్చు. కోరికలు ఏవైనా దీర్ఘకాలంలో నెరవేరే అవకాశాలు ఉంటాయి. ఏదైనా విషయంలో ఒత్తిడికి గురైతే అవి దూరమవుతాయి.

కలలో రైలును వెంబడించడం చాలా అశుభకరం. ఇలాంటి కల వస్తే భవిష్యత్తులో కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయని అర్థం. అంతేకాదు పనిలో వైఫల్యం కారణంగా నిరాశకు గురవుతారు. భవిష్యత్తులో వ్యాపార పెట్టుబడులలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

కలలో రైలును మిస్ అయినట్లు కనిపిస్తే అది అశుభ సంకేతం. దీనివల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని అర్థం. అంతేకాదు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు నిలిచిపోవచ్చు లేదా నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కాకుండా మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×