BigTV English

Best Tithis: ఏ తిథిలో ఏ పని చేస్తే కలిసి వస్తుందో తెలుసా?

Best Tithis: ఏ తిథిలో ఏ పని చేస్తే కలిసి వస్తుందో తెలుసా?

Tithis: తిథులు అంటే ఏమిటి..? ఏ తిథి ఎలాంటి ఫలితం ఇస్తుంది.. దశమి, ఏకాదశి, పౌర్ణమి తప్పా మిగతా తిథులు మంచివి కావా..? అమావాస్య తర్వాతే తెలుగు నెల ఎందుకు మొదలవుతుంది..? అసలు ఏ తిథిలో ఏ పని చేస్తే కలసి వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.


హిందూ సాంప్రదాయంలో తిథులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శుభ కార్యాలకైనా అశుభ కార్యాలకైనా తిథులను ప్రామాణికంగా తీసుకుంటారు. తిథులను చూసుకున్నాకే ఏ పనైనా ప్రారంభిస్తారు.  కొన్ని పనులు కొత్తగా ప్రారంభించాలి అనుకోగానే మంచి రోజు చూసుకునే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఈ తిథి మంచిదా కాదా..? అని ఆలోచిస్తారు. పెద్ద పెద్ద కార్యక్రమాలకు అయితే  పండితుల దగ్గరకు వెళ్లి ముహూర్తం పెట్టించుకుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న పనులకు మాత్రం కేవలం మంచి తిథి చూసుకుని ముందడుగు వేస్తారు.

అలాంటప్పుడు కూడా అమావాస్య ముందు ఏదైనా పని చేయాలంటే ఆలోచిస్తారు. అమావాస్య మర్నాడు బలిపాడ్యమి అనే సెంటిమెంట్ మరికొందరికి ఉంటుంది. దశమి, ఏకాదశి తిథుల్లో ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తవుతుందని భావిస్తారు కానీ మిగిలిన తిథుల గురించి అంతగా పట్టించుకోరు. అయితే 16 తిథుల్లో కొన్ని  మంచి ఫలితాలనిస్తే…మరికొన్ని తిథులు అశుభఫలితాలను ఇస్తాయంటారు పండితులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


పాడ్యమి:  ఈ తిథి మొదటి అర్థభాగం మంచిది కాదంటారు పండితులు.. కానీ తర్వాత అర్థభాగం చాలా మంచిది అనే ఉవాచ ఉంది.

విదియ: ఈ విదియ తిథి చాలా మంచిదని ఈ రోజు ఏ పని తలపెట్టినా అంతా  శుభమే జరుగుతుందంటారు పండితులు.

తదియ: ఈ తిథి సమయంలో చేసే ఏ పనిలోనైనా విజయం వరిస్తుందంటారు. ఆనందం, సంతోషం ఈ తిథిలొ తాండవిస్తాయట.

చవితి: ఈ తిథికి మరోపేరు చల్లని తిథి అని ఉంది. అయితే ఈ చవితి నాడు అర్ధభాగం పూర్తయ్యాక బేషుగ్గా ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.

పంచమి: పంచమి  తిథి శుభానికి చిహ్నం అంటారు. ఈ తిథిలో ఏం చేసినా అంతా లాభమే వరిస్తుందట.

షష్టి: ఈ తిథి కొంచెం ఇబ్బందికరమైనదిగా బావిస్తారు. ఈ తిథి ఉన్న సమయంలో ఏ పని ప్రారంభించినా పెద్దగా కలసిరాదట.. అందుకే షష్టీ  రోజు ఏ పనీ కొత్తగా ప్రారంభించరు.

సప్తమి: సస్తమి రోజు ఏం చేసినా కలిసే వస్తుందట. ముఖ్యంగా చదువులకు సప్తమి తిథి మంచిదంటారు. స్పష్టంగా చెప్పాలంటే ఇది విద్యార్థుల తిథి.

అష్టమి: ఈ తిథి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. ఇది కేవలం దుర్గాదేవికి మాత్రమే కలిసొచ్చే తిథి..ఈ రోజు ఏం చేసినా అష్టకష్టాలు తప్పవంటారు పండితులు.

నవమి: నవమి కూడా అంత మంచిది కాదంటారు. నవమి రోజు పుట్టిన రాముడికే తప్పలేదు అరణ్యవాసం ఇక సామాన్య మనుషులం మనకెంతా అంటారు పండితులు. ఈ రోజు ఎటువంటి కొత్త పనులు ప్రారంభించరు.

దశమి: ఈ తిథి పేరులోనే ఉంది దశ తిరుగుతుందని.. మనుషుల దశ దిశ మార్చే తిథిగా దీనికి పేరుంది. ఈ  తిథి రోజు ఏ పని మొదలు పెట్టినా తిరుగుండదు అంటారు పండితులు

ఏకాదశి: ఈ తిథి కూడా మంచిదే కానీ ఈ రోజు పది పనులు చేపడితే అందులో ఒకటి అవుతుందని చెబుతారు పండితులు.

ద్వాదశి: ఈ తిథి ప్రయాణాలకు చాలా మంచింది. అయితే ఖాళీ కడుపుతో బయలుదేరకుండా ఏదైనా తినేసి వెళితే తలపెట్టిన పనులు నెరవేరుతాయంటారు.

త్రయోదశి: ఈ తిథి కూడా చాలా మంచిదని ఈ తిథి ఉన్న రోజు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్‌ అవుతారని పండితులు చెప్తారు.

చతుర్దశి: ఈ తిథి నెలలో అమావాస్య ముందు వస్తే అది మాస శివరాత్రిగా పరిగణిస్తారు. అయితే ఈ తిథిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు.

పౌర్ణమి: అన్ని తిథుల కన్నా మోస్ట్ పవర్‌ఫుల్ తిథి  పౌర్ణమి. పౌర్ణమి రోజు ఏం చేసినా కలిసే వస్తుందట.. అయితే ఈ రోజు వర్జ్యం లేకుండా ఉంటే  మరింత మంచిదని పండితులు చెబుతారు.

అమావాస్య: అమావాస్యను కొన్ని ప్రాంతాలలో చెడు తిథిగా మరికొన్ని ప్రాంతాలలో చాలా మంచి తిథిగా బావిస్తారు. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ తిథిని డేంజర్‌ తిథిగా చూస్తారు. అమావాస్య రోజు ఎటువంటి కొత్త పనులు ప్రారంభించకపోవడమే కాకుండా.. చేసే పనులు, వ్యాపారాలు కూడా బందు పెడతారు.

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×