వంటగదిలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన నూనెను వాడుతూ ఉంటారు. అధికంగా వాడితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అయితే వంట గదిలో వాడకూడని మూడు రకాల నూనెలు ఉన్నాయి. వీటిని వాడడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. ఇవి తక్కువ ధరకే లభిస్తాయని ఎంతోమంది వాడేస్తూ ఉంటారు. కానీ వీటిని అధికంగా వాడితే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. వంటల్లో పూర్తిగా వాడకూడని కొన్ని రకాల నూనెలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి సోయాబీన్ ఆయిల్, కార్న్ ఆయిల్, రాప్ సీడ్ ఆయిల్. వీటిని వాడకుండా ఉండడమే ఉత్తమం.
పైన చెప్పిన నూనెలు అన్నీ విపరీతమైన ప్రాసెసింగ్‌కు గురవుతాయి. ఆ ప్రాసెసింగ్‌లో కొన్ని రసాయనాలు జతచేరితే పోషకాలను కోల్పోతాయి. అలాగే ఆ ప్రాసెసింగ్ లో హానికరమైన సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల వాటిని తినడం ప్రమాదకరంగా మారుతుంది. అలాగే ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు… వీటిలో అధికంగా ఉంటాయి. ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరానికి చాలా తక్కువగా అవసరం పడతాయి. అవి ఎక్కువైతే శరీరంలో ఇన్ఫ్మేషన్ పెరిగిపోతుంది. కాబట్టి ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే నూనెలకు దూరంగా ఉండటమే మంచిది. అలాగే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉన్న నూనెలు వాడితే మాత్రం ఆరోగ్యానికి మంచిది.
సోయాబీన్ ఆయిల్ అందరికీ తెలిసిందే. మొక్కజొన్న నూనెను కూడా వాడుతూ ఉంటారు. ఈ రెండూ కూడా వాడకపోవడమే ఉత్తమం, ఇక రాప్ సీడ్ ఆయిల్ అంటే ఆవాలు జాతికి చెందిన సీడ్స్ తోనే ఈ నూనెను తయారు చేస్తారు. వీటిని వాడడం ఏమాత్రం మంచిది కాదు. ఈ నూనెలో ఆహారాలను వేయించడానికి ఉపయోగిస్తే అవి విషపూరితంగా మారే అవకాశం ఉంది. వీటిని పదేపదే వేడి చేయడం లేదా అధిక ఉష్ణోగ్రత వల్ల వాడడం వల్ల క్యాన్సర్ కారకాలైన ట్రాన్స్ ఫ్యాట్స్, ఆల్డిహైడ్లు వంటి హానికరమైన సమ్మేళనాలు విడుదల చేస్తాయి.
సోయాబీన్ ఆయిల్, మొక్కజొన్న ఆయిల్, రాప్ సీడ్ ఆయిల్ బదులుగా మన ఆరోగ్యానికి మేలు చేసే నూనెలను ఎంచుకోవాలి. అవకాడో ఆయిల్ అనేది ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే కొబ్బరి నూనె కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ వీటిని వాడడం మన దగ్గర చాలా తక్కువ. ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ ధర అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది వాడలేరు. ఇక్కడ కొబ్బరి నూనె విషయానికి వస్తే కేరళలో పూర్తిగా కొబ్బరినూనెతోనే వంటకాలను తయారు చేస్తారు. కానీ మన దగ్గర కొబ్బరి నూనెతో వంటలు చేయరు. కొబ్బరి నూనెను తలకు రాసుకునే అందుకే ఇష్టపడతారు.
Also Read: సన్నగా ఉన్నారా ? ఇవి తింటే.. త్వరగా బరువు పెరుగుతారు
నిజానికి కొబ్బరి నూనెతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీలైనంతవరకు కొబ్బరి నూనెను వాడేందుకు ప్రయత్నించండి. మన దగ్గర ఎక్కువగా రైస్ బ్రాన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, నువ్వుల నూనె… వీటిని అధికంగా వాడుతూ ఉంటారు. వీటివల్ల ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఏమీ లేదు, కానీ మితంగానే వాడాలి. వీటికి బదులు కొబ్బరి నూనె వాడడం మొదలుపెడితే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది.