BigTV English

Chandra Grahanam: మరో ఐదు రోజుల్లో చంద్రగ్రహణం, ఇది మనదేశంలో కనిపిస్తుందా? ఎలాంటి నియమాలు పాటించాలి?

Chandra Grahanam: మరో ఐదు రోజుల్లో చంద్రగ్రహణం, ఇది మనదేశంలో కనిపిస్తుందా? ఎలాంటి నియమాలు పాటించాలి?

Chandra Grahanam: ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చిలో వచ్చింది. ఇప్పుడు రెండో చంద్రగ్రహణం రాబోతోంది. ఈనెల సెప్టెంబర్ 18న రెండవ చంద్రగ్రహణం సంభవించనుంది. సైన్స్ పరంగా చూస్తే చంద్ర గ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన, కానీ హిందూ మతంలో మాత్రం చంద్రగ్రహణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే ఆ రోజున శుభకార్యాలు మాత్రం చేయరు.


నాసా చెబుతున్న ప్రకారం ఇది ఒక పాక్షిక చంద్రగ్రహణం. పితృపక్షంలో ఏర్పడే గ్రహణం ఇది. పితృపక్షం సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ 18న చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.

మనకు కనిపిస్తుందా?


ఈసారి వచ్చే చంద్రగ్రహణం మనదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణానికి మన దేశంలో ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు.

సమయం ఎప్పుడు?

భారత కాలమాన ప్రకారం చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 ఉదయం 6:12 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మళ్లీ 7:44 నిమిషాలకు ముగిసిపోతుంది. ఆ సమయంలో మనకు చంద్రుడు కనిపించడు. అది మనకు ఉదయం కాబట్టి గ్రహణం ఏర్పడినా కూడా ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు.

చాలామంది సూతక కాలం గురించి వెతుకుతూ ఉంటారు. సూతక కాల నియమాల ప్రకారం చంద్రగ్రహణం పూర్తిగా కనిపించే చోట మాత్రమే ఆ నియమాలు వర్తిస్తాయి. మన దేశంలో చంద్రగ్రహణం కనిపించదు, కాబట్టి సూతక్ కాలం ఉండదు.

ఎవరికి కనిపిస్తుంది?

నాసా చెబుతున్న ప్రకారం మరొక ఐదు రోజుల్లో ఏర్పడే పాక్షిక చంద్రగ్రహణం అమెరికా, యూరోప్, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది. ఆసియాలోని కొన్ని ప్రదేశాల్లో గ్రహణం కనిపించే అవకాశం ఉన్నా, భారతదేశంలో మాత్రం ఏ మూలా కనిపించే ఛాన్స్ లేదు.

చంద్రగ్రహణం అంటే..

చంద్రగ్రహణం అంటే చంద్రుడు, సూర్యుడు మధ్యకు భూమి వచ్చినప్పుడు ఆ భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీని కారణంగా చంద్రుడు కొంత సమయం వరకు కనిపించడు. దీన్నే చంద్రగ్రహణం అంటారు. చంద్రగ్రహణం ఉదయం పూట వస్తే ఎవరూ చూడలేరు. రాత్రిపూట కనిపిస్తేనే చూడగలరు. ఈసారి మనకి చంద్రగ్రహణం ఉదయం సమయాల్లో వచ్చింది కాబట్టి కనిపించే అవకాశం లేదు.

ఎప్పుడైనా చంద్రగ్రహణాన్ని చూడాలనిపిస్తే టెలిస్కోపు, బైనాక్యులర్‌ను ఉపయోగించండి. అలాగే డీఎస్ఎల్ఆర్ కెమెరాతో కూడా వీటిని చక్కగా ఫోటోలు తీయవచ్చు.

చంద్రగ్రహణం కనిపించకపోయినా మీరు ఆ నియమాలను పాటించాలనుకుంటే కొన్ని పనులు గ్రహణ సమయంలో చేయకూడదు. గ్రహణం ఉన్నంత సేపు ఏమీ తినకూడదు. స్టవ్ వెలిగించి వంట చేయడం వంటివి కూడా చేయకూడదు. ఇంట్లో దేవతా విగ్రహాలను తాకకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఆలయాలకు వెళ్ళకూడదు. ఇంట్లో ఉన్న తులసి మొక్కను కూడా తాకకుండా ఉండాలి. అలాగే గ్రహణ సమయంలో కత్తులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. అలాగే జాతక చక్రములో చంద్రుడు బలహీనంగా ఉంటాడు. అలాంటివారు చంద్రగ్రహణ సమయంలో చంద్ర మంత్రాలు చదివితే ఎంతో మంచిది. చంద్రగ్రహణానికి ముందు, గ్రహణం వదిలిన తర్వాత కూడా తలకు స్నానం చేయడం ఎంతో ఉత్తమమైనదని పండితులు చెబుతున్నారు.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×