Lunar Eclipse: చంద్రగ్రహణాన్ని హిందూ భక్తులు పవిత్రంగా భావిస్తారు. సెప్టెంబర్ 18న చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇది నిజానికి మనదేశంలో కనిపించక పోయినా కూడా ఆ ప్రభావం ఉంటుందని కొంతమంది నమ్మకం. అలాంటివారు చంద్రగ్రహణ నియమాలు పాటించేందుకు ఇష్టపడతారు. చంద్రగ్రహణం రోజు ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకోండి.
సెప్టెంబర్ 18న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారతదేశ కాలమానం ప్రకారం ఉదయం 7:42 నిమిషాలకు మొదలవుతుంది. 8:14 నిమిషాలకు గరిష్ట స్థాయికి చేరి, 8:45 నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, రష్యాలోని నైరుతి భాగంలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారతదేశంలో కనిపించే అవకాశాలు శూన్యం.
గ్రహణం కనిపించకపోయినా చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల కొంతమంది ఆ నియమాలను పాటించేందుకు ఇష్టపడతారు. ఈ సమయంలో ప్రార్ధనలు, ధ్యానం చేస్తూ ఉంటారు. నిత్యం దైవారాధన చేస్తూ ఉంటారు. అలాగే గ్రహణ సమయంలో ఆహారం వండడం లేదా తినడం మంచిది చేయరు.
గ్రహణ సమయంలో మనుషుల శక్తి తగ్గుతుందని ఆ సమయంలో దైవారాధన చేయడం ద్వారా శక్తి కోల్పోకుండా ఉండవచ్చని, అధిక శక్తిని పొందవచ్చని చెబుతూ ఉంటారు. ఈ సమయంలో జీర్ణక్రియ, జీవ క్రియ కూడా ప్రభావితం అవుతుందని చెప్పుకుంటారు. అందుకే గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం మానుకోవాలని ఆయుర్వేదం కూడా సలహా ఇస్తుంది. గ్రహణం ఉన్నంతకాలం ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు.
హిందూ పండితులు చెబుతున్న ప్రకారం తులసి ఆకులను ఆహారం, నీరు ఉన్న పాత్రలో వేయడం వల్ల గ్రహణ సమయంలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించవచ్చని తెలుస్తోంది. అలాగే గ్రహణం రోజు మాంసాహారం, రొట్టెలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆల్కహాల్, పుల్లని ఆహారాలు, పులియబెట్టిన ఆహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిదని వివరిస్తున్నారు.
పురాతన నమ్మకాల ప్రకారం చంద్రుని చక్రం శరీరంపై ప్రభావం చూపుతుందని చెబుతారు. గ్రహణం రోజున లేదా గ్రహణ సమయంలో మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని అంటారు. అందుకే గ్రహణ సమయంలో పూర్తిగా ఆహారాన్ని తినకూడదని చెబుతారు. అలాగే గ్రహణం రోజున తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తినాలని వివరిస్తారు.
Also Read: నవరాత్రుల్లో 9 రోజులు ఇలా చేస్తే భవాని మాత అన్ని సమస్యలను తొలగిస్తుంది
గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఏదైనా తినడం, తాగడం చేయకూడదు. దీనివల్ల శిశువు రాశిచక్రంలో చంద్రుడు, సూర్యుడు, రాహువు, కేతువులతో సమస్యలు వస్తాయని అంటారు.
గ్రహణానికి ముందు, గ్రహణానికి తర్వాత కూడా తలకు స్నానం చేయడం చాలా ముఖ్యం. గ్రహణం ముగిసిన తర్వాత ఇంటి నిండా గంగా జలాన్ని చల్లాలని కూడా పండితులు చెబుతారు. అలాగే కుటుంబంలోని సభ్యులపై కూడా గంగా జలాన్ని చల్లుకోవాలి. గ్రహణ సమయంలో ఇంట్లో సానుకూలత ఉండాలంటే దేవుని మంత్రాలను పఠించడం చాలా ముఖ్యం. చంద్రదోషాన్ని తొలగించడానికి తెల్ల నువ్వులను, గోధుమ పిండిని బ్రాహ్మణులకు లేదా పేదవారికి దానం చేస్తే మంచిది.
గ్రహం సమయంలో పఠించాల్సిన మంత్రాలు..
ఓం చంద్రయే నమః
ఓం నమో భగవతే నమః
ఓం శ్రీం ద్రో సహా చంద్రమసే నమః
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)