BigTV English

Gorre Puranam : గొర్రె పురాణం రిలీజ్ ఉన్నట్టా లేనట్టా? సినిమాను పట్టించుకోని నిర్మాత, హీరో

Gorre Puranam : గొర్రె పురాణం రిలీజ్ ఉన్నట్టా లేనట్టా? సినిమాను పట్టించుకోని నిర్మాత, హీరో

Gorre Puranam : ‘కలర్ ఫోటో’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘రైటర్ పద్మభూషణ్’ వంటి వినోదాత్మక చిత్రాలతో పాటు ‘ప్రసన్న వదనం’ వంటి థ్రిల్లర్‌లతో తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకుంటున్నాడు సుహాస్. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. అందులో ఇప్పటికే ఓ సినిమా వాయిదా పడగా, మరో సినిమా ‘గొర్రె పురాణం’ అసలు రిలీజ్ అవుతుందా ? లేదా? అనే అనుమానం మొదలైంది. దానికి కారణం ఇంకెవరో కాదు హీరో, నిర్మాత.


‘గొర్రె పురాణం’ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా ?
టాలెంటెడ్ హీరో సుహాస్ హీరోగా నటిస్తున్న ‘గొర్రె పురాణం’ మూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘లవ్ స్టోరీ’ అనే సినిమాకి సంగీతం అందించిన పవన్ సి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. బాబీ ‘గొర్రె కథ’కి దర్శకత్వం వహించారు. ఫోకల్ వెంచర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మూవీని ప్రకటించినప్పటి నుంచే మంచి బజ్ ఉంది. మరో మూడు రోజుల్లో ఈ మూవీ తెరపైకి రానుంది. ఇలాంటి టైమ్ లో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో తల మునకలై ఉంటారు. మూవీపై ఎంత బజ్ పెంచితే అంతగా జనాల్లోకి వెళ్ళి, మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందుగానే సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని, మిగతా సమయాన్ని ప్రమోషన్ల కోసం కేటాయిస్తారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇంకా రిలీజ్ కు రెండ్రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ‘గొర్రె పురాణం’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు మేకర్స్. దీనికి గల కారణం ఏంటో తెలియరాలేదు కానీ హీరో, నిర్మాత ‘గొర్రె పురాణం’ మూవీని పట్టించుకోవట్లేదనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. అందుకే అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు ‘గొర్రె పురాణం’ మూవీ పోస్ట్ పోన్ అయ్యి ఉంటుందని, అందుకే నిర్మాతతో పాటు హీరో సుహాస్ కూడా సినిమా ప్రమోషన్ల గురించి పట్టించుకోవట్లేదని అంటున్నారు. మరి సినిమా వాయిదా పడిందా? లేదా మేకర్స్ పట్టించుకోవట్లేదా? అనే విషయంలో క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించేదాకా ఆగాల్సిందే.

Gorre Puranam trailer: A crazy goat disrupts communal harmony in this Suhas  starrer


వాయిదా పడిన ‘జనక అయితే గనక’
ఒకవైపు ‘గొర్రె పురాణం’ మూవీ రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంటే, మరోవైపు సుహాస్ హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జనక అయితే గనక’ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అక్టోబర్ 12ను ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ గా ప్రకటించారు మేకర్స్. ఇక ఈ రెండు సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. దీంతో గొర్రె పురాణం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరి సుహాస్ నటించిన ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×