BigTV English

Maghamasam : మాఘమాసంలో మంచి ముహూర్తాలు

Maghamasam : మాఘమాసంలో మంచి ముహూర్తాలు

Maghamasam : భారతీయ క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసాల్లో ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.ఈనెల 22న నుంచి మాఘమాసం మొదలవుతోంది. జనవరి శుద్ధ పాడ్యమి రోజున మొదలై ఫిబ్రవరి 20 అమావాస్య సోమవారం నాడు ముగుస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రదమైందనిగా భావిస్తారు. మాఘం అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు.నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కాలుష్యాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించారు.


సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంటంది. ఈ మాసంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం కలుగుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. మాఘమాస స్నానం ఆచరింలేని వాళ్లు మాఘ పురాణం పఠించమని శాస్త్రం ప్రత్యామ్నాయం చూపుతోంది.

ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెలనాళ్ళు ముల్లంగి దుంపను తినరు. పంచదారను నువ్వులను , కలిపి తినడం, నువ్వులను దానం చేయడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది. మాఘమాంసలో వచ్చే ప్రతి ఆదివారం ఎంతో పవిత్రమైనదిగా కొలుస్తుంటారు. అంతేకాదు ఈ రోజుల్లో ఎంతో మంది దేవతలు ఎన్నో పూజలను నైవేద్యాలను అందుకుంటారు. ఈ మాఘమాసం మొత్తం శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి. ఈ రోజుల్లో పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతోంది.


Follow this link for more updates:- Bigtv

Related News

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Big Stories

×