Maha Shivratri 2025: మహా శివుడిని ఆదిదేవుడు, నిర్గుణ, నిరాకార, నిరామయుడని చెబుతూ ఉంటారు. హిందువుల అత్యంత పవిత్రమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. మన పండుగలన్ని తిథుల తోను, నక్షత్రాలతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండుగలకు తిథులు, మరికొన్ని పండుగులకు నక్షత్రాలు ప్రధానం అవుతాయి. అలాగే ప్రతినెల వచ్చేదానిని మాస శివరాత్రి అని అంటారు. ఆ రోజున ఈశ్వరుడిని ఆలయాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు. శివరాత్రి అనేది మాఘ, బహుళ, చతుర్ధసి నాడు వస్తుంది.
దీనిని మహా శివరాత్రి పర్వదినంగా పేర్కొని ఎంతో విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు. ఈరోజున భక్తులు భోళా శంకరుడ్ని లింగోద్భాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఉపవాస దీక్షను తీసుకుని జాగరణ చేస్తారు. ఈ ఏడాది మహా శివరాత్రి ఫిబ్రవరి 26న వచ్చింది. ఈ సందర్భంగా శివరాత్రి రోజున మీ బంధు మిత్రులకు, స్నేహితులకు విషెస్ ఇలా చెప్పండి.
⦿ ఓం నమ: శివాయ.. మీకు, బంధు మిత్రులకు, ప్రియమైన స్నేహితులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
⦿ ఈ పవిత్ర శివరాత్రి అనుగ్రహం మీ జీవితాన్ని ఆనందం, శాంతి, సంపద కలిగించాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
⦿ ఈ మహా శివరాత్రి వేళ శివుని ఢమరుకం మోగి, భక్తుల హృదయాలలో ఆనందం నింపాలని కోరుకుంటూ మీకు, కుటుంబ సభ్యులకు శివరాత్రి శుభాకాంక్షలు
⦿ ఆ శివయ్య ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మహా శివరాత్రి శుభాకాంక్షలు
⦿ శివుని త్రినేత్రాల దీవెనలు మీ జీవితంలో అన్ని అంధకారాలను తొలగించి, వెలుగు నింపాలని కోరుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు
⦿ ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోయి , సుఖ, సంతోషాలు జీవించాలను ఆకాంక్షిస్తూ.. శివరాత్రి శుభాకాంక్షలు
⦿ ఈశ్వరుడి చల్లని దీవెలను ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటూ మహా శివరాత్రి శుభాకాంక్షలు
⦿ హర హర మహదేవ శంబో శంకర.. మీకు, స్నేహితులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
⦿ శివుని పేరు జపిస్తూ శివరాత్రి అంతా గడపండి.. ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందండి. మీకు, కుటుంబ సభ్యులకు శివరాత్రి శుభాకాంక్షలు
⦿ మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం.. మీకు, కుటుంబ సభ్యులకు శివరాత్రి శుభాకాంక్షలు.
⦿ హర హర మహదేవ శంబో శంకర.. మహా శివరాత్రి శుభాకాంక్షలు
⦿ ఈ పవిత్రమైన మహా శివరాత్రి మీ ఇంట్లో ఆనందాన్ని, ప్రశాంతతను కలుగ జేయాలని మనసారా కోరుకుంటూ.. మహా శివరాత్రి శుభాకాంక్షలు
Also Read: మహా శివరాత్రి నాడు ఈ పనులు అస్సలు చేయకండి.. కష్టాలను కోరి తెచ్చుకున్నట్టే
⦿ ఆ పార్వతీ, పరమేశ్వరుల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. మహా శివరాత్రి శుభాకాంక్షలు
⦿ ఓం మహా ప్రాణ దీపం శివం శివం.. మహోంకార రూపం శివం శివం.. మీకు, మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
⦿ మీ కోరికలన్ని ఆ పరమేశ్వరుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు