BigTV English

Priests Break Dance: బ్రహ్మోత్సవాల్లో పంతులు గారి బ్రేక్ డ్యాన్స్.. పెద్ద డ్యాన్సర్లు కూడా పనికిరారు!

Priests Break Dance: బ్రహ్మోత్సవాల్లో పంతులు గారి బ్రేక్ డ్యాన్స్.. పెద్ద డ్యాన్సర్లు కూడా పనికిరారు!

Priests Break Dance: ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతగా వైరల్ గా మారిందంటే, గంటల వ్యవధిలో మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. కానీ కామెంట్స్ కొంత నెగిటివ్, కాస్త ఎక్కువగా పాజిటివ్ వస్తున్నాయి. ఇంతకు ఆ వీడియోలో ఏముంది? అసలు ఆ వీడియో అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.


సాధారణంగా ఏదైనా ఉత్సవాలు, వివాహ ఊరేగింపులు నిర్వహించే సమయంలో డ్యాన్సులు చేయడం సహజం. పెళ్లిళ్లలో జరిగే డ్యాన్సుల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ పూర్తిగా మద్యం సేవించి ఎంజాయ్ చేసే వారు కొందరు ఉంటే, మరికొందరు పెళ్లి కదా ఆ మాత్రం ఎంజాయ్ చేయాలని డ్యాన్సులు వేస్తుంటారు. అందులోనూ ఇటీవల డిజే మోతలు లేని పెళ్లిళ్లను ఊహించలేము. అంతేకాదు ఏదైనా ఉత్సవం జరుగుతున్నా, అందరినీ అలరించేందుకు డిజే మ్యూజిక్ ఉండే పరిస్థితి.

గతంలో వివాహమైనా, దైవ కార్యమైనా బ్యాండ్ మేళాలు వినసొంపుగా ఉండేవి. కాలం మారింది. అంతా ఆధునిక పద్దతులు, పరికరాలు ఫ్యాషన్ గా మారాయి. దేవుని ఉత్సవమైనా భక్తుల కోరిక మేరకు నిర్వాహకులు డిజే ఏర్పాటు చేస్తున్నారు. ఈ డిజే పాటలకు యువత చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే సాధారణంగా దేవుడి ఉత్సవాలకు అయితే భక్తికి సంబంధించిన డిజే పాటలు మోత మోగిస్తాయి. ఆ మోతకు అందరికీ ఊపు రావాల్సిందే. ఇలాంటి ఘటనే ఇది. అయితే ఇక్కడ కాస్త భిన్నంగా సాగింది. అందుకే క్షణాల వ్యవధిలో ఆ వీడియో వైరల్ గా మారింది.


శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని చారిత్రక ప్రాముఖ్యత గల శ్రీ వాసుదేవ పెరుమాళ్ 16వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి వారికి పూజలు నిర్వహించారు. అయితే స్వామి వారి బ్రహ్మోత్సవాల సంధర్భంగా నిర్వహకులు డిజే ఏర్పాటు చేశారు. దీనితో డిజేలో భక్తి గీతాలు మోత మోగించాయి. యువకులు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.

అయితే ఇక్కడి వరకు ఓకేగానీ, అక్కడే గల పంతుళ్లు కూడా డ్యాన్స్ చేయడం విశేషం. అది కూడా పెద్ద పెద్ద డ్యాన్సర్లను మించేలా అన్నీ ఫ్లోర్ మూమెంట్స్ చేయడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఇక్కడ డ్యాన్స్ చేసింది మాత్రం భక్తి పాటకే. పది మంది యువకులతో పాటు వారు కూడా కలిసి సందడి చేశారు. ఆ వీడియోలను ఎవరో చిత్రీకరించారు. ప్రస్తుతం అవే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read; BR Naidu: తిరుమలలో మళ్లీ తోపులాట.. అసలు నిజమిదే!

కొందరేమో.. ఔను భక్తి పాటకు డ్యాన్సులు వేసి, వారి ఆనందాన్ని పంచుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో పంతుళ్ళు ఇది మీకు తగునా అంటూ నెగిటివ్ కామెంట్స్ తో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు.. పంతుళ్ల డ్యాన్స్ యమ కిరాక్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మారిన కాలానుగుణంగా పంతుళ్లు.. యువతలో ఉత్సాహం నింపేందుకు డ్యాన్స్ చేస్తే, ఇప్పుడు వారు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఏదిఏమైనా కాలం మారింది.. మనం కూడా మారాలి అంటూ పలువురు పంతుళ్లకు మద్దతుగా నిలుస్తూ.. సూపర్ అంటూ కితాబిస్తున్నారు. ఆ వీడియో కింది లింక్ లో మీరు ఓ లుక్కేయండి!

Related News

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..

Cinnamon Throwing Tradition: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?

Bacha Bazi Tradition: బచ్చా బాజీ.. పాక్‌ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!

Young president: 20 ఏళ్లకే సొంత దేశాన్ని సృష్టించి తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న యువకుడు, 400 మంది పౌరులు

Finger Cutting Ritual: ఇంట్లో ఎవరైనా చనిపోతే.. వేళ్లు కట్ చేసుకుంటారు, ఆ ఊర్లో ఇదే ఆచారం!

Big Stories

×