BigTV English

Prabhas: ఇదెక్కడి విడ్డూరం.. ప్రభాస్ పేరుతో ఒక ఊరు కూడా ఉందా.. ? ఎక్కడో తెలుసా.. ?

Prabhas: ఇదెక్కడి విడ్డూరం.. ప్రభాస్ పేరుతో ఒక ఊరు కూడా ఉందా.. ? ఎక్కడో తెలుసా.. ?

Prabhas: సాధారణంగా ప్రాంతాలకు స్వాత్యంత్ర యోధుల పేర్లను పెడుతూ ఉంటారు. కొన్ని వీధులకు స్టార్స్ పేర్లు పెడుతూ ఉండడం చూస్తూనే ఉంటాం. ఇక క్రికెటర్స్ పేర్లతో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి.అయితే ఇప్పటివరకు ఒక సౌత్ ఇండియన్ హీరో పేరు మీద ఒక ఊరు ఉంది. ఆ హీరో ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. అవును.. మీరు ఉంటుంది నిజమే. ప్రభాస్ అనే పేరు మీద ఒక ఊరు ఉంది.  అది మన ఇండియాలో లేదు. మన పక్క దేశం అయిన నేపాల్ లో ఉంది. ఈ గ్రామాన్ని ఎవరు కనుక్కున్నారు.. ? ఆ కథ ఏంటి అనేది తెలుసుకుందాం.


ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్ ఎక్కువగా మోటో  బ్లాగ్స్ చేస్తున్న విషయం తెల్సిందే. బైక్స్ మీద రోడ్డు ద్వారా చిన్న చిన్న గ్రామాలను  ఎక్స్ ఫ్లోర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఒక బ్లాగర్ ఇండియా నుంచి పోక్రాకు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో అతనికి ఒక బోర్డు కనిపించింది. దాని మీద ప్రభాస్ అని రాసి ఉంది.అదొక గ్రామం పేరు. దీంతో షాక్ అయిన సదురు బ్లాగర్ వెంటనే.. ఆ ఊరు గురించి చెప్తూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ” పోక్రాకు వెళ్తున్న దారిలో నేను వాటర్ బ్రేక్ కోసం ఆగాను. ఈ ఊరు పేరు ప్రభాస్. అది చూడగానే నాకు సంతోషం వచ్చింది. డార్లింగ్ ఫ్యాన్స్ చూస్తే మరింత ఖుష్ అవుతారని వీడియో తీసాను” అంటూ ఆ ఊరు గురించి చెప్పుకొచ్చాడు.

ప్రసుతం ప్రభాస్ ఊరుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక డార్లింగ్ పేరుతో ఉన్న ఈ గ్రామం గురించి విన్నవారు నోళ్లు నొక్కుకుంటున్నారు. అయితే ఈ గ్రామానికి ప్రభాస్ అని పేరుఎందుకు పెట్టారు.. ? ఎలా వచ్చింది.. ? అనేది మాత్రం తెలియదు. అయినా డార్లింగ్ పేరు ఉండడంతో ఫ్యాన్ తమ హీరో పేరుమీద ఒక విలేజ్ ఉందని సంతోషం వేయటం చేస్తున్నారు.


Divorce : 37 ఏళ్ల వైవాహిక బంధానికి బ్రేక్… విడాకుల బాట పడుతున్న సీనియర్ హీరో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక బాహుబలి సినిమాతో మొట్ట మొదటి పాన్ ఇండియా స్టార్ గా మారాడు. హీరోగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా డార్లింగ్.. డార్లింగే. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని ఏకైక హీరో అంటే ప్రభాస్ అనే చెప్పాలి. చాలా మొహమాటస్తుడు.

ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. గతేడాది కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ఈ ఏడాది ది రాజా సాబ్ తో రానున్నాడు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10 న రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. కానీ, కొన్ని కారణాల వలన ఏప్రిల్ నుంచి ఆగస్టుకు వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. మరి అందులో ఎంత నిజం ఉన్నది అనేది తెలియాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×