E-Paper
Advertisement

Mahalaxmi Rajyog 2024: మహాలక్ష్మీ రాజయోగం.. 3 రాశుల వారికి కెరీర్ పరంగా శుభసమయం

Mahalaxmi Rajyog 2024: మహాలక్ష్మీ రాజయోగం.. 3 రాశుల వారికి కెరీర్ పరంగా శుభసమయం
Advertisement

Mahalaxmi Rajyog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశిని మార్చుకుంటాయి. ఫలితంగా రాశులపై ఈ ప్రభావం ఉంటుంది. గ్రహాల సంచారం శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తుంది. జూన్ 30వ తేదీన మేషరాశిలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. అంగారకుడు, చంద్రుడి కలయిక వల్ల ఈ యోగం ఏర్పడింది.

ఈ యోగం యొక్క శుభ ఫలితాలు 3 రాశులపై ఉంటాయి. ఈ రాశుల వారు మహాలక్ష్మీ రాజయోగం వల్ల ఆకస్మిక లాభాలు, శ్రేయస్సును పొందుతారు. మహాలక్ష్మీ రాజయోగం వల్ల ఏ రాశుల వారికి శుభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మేష రాశి: మహాలక్ష్మీ రాజయోగం వల్ల మీకు శుభాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ యోగం మేషరాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి. మీరు పని, వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. అంతే కాకుండా మీ వైవాహిక జీవితం బాగుంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ప్రారంభించే, ఉపాది కల్పించే ఏ పని అయినా విజయవంతం అవుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో మీరు డబ్బు సంపాదించడమే కాకుండా డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు. ఫలితంగా మీరు ఆర్థికంగా మంచి స్థానంలో ఉంటారు.

కర్కాటక రాశి: మహాలక్ష్మీ రాజయోగం ఫలితంగా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం మీ జాతకంలో 10వ ఇంట్లో ఉండబోతుంది. మీకు ఈ సమయంలో వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఆస్తి, కారు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు, జీతాలు పెరుగుతాయి. అదనంగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీరు వేసే ప్రణాళికలు విజయవంతం అవుతాయి.

Advertisement

Also Read: ఉదయించనున్న శుక్రుడు.. 260 రోజులు 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్

తులా రాశి: మహాలక్ష్మీ రాజయోగం వల్ల మీరు అద్భుత ఫలితాలు పొందుతారు. ఈ రాజయోగం మీ 7వ ఇంట్లో ఏర్పడింది. కాబట్టి మీరు ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. గౌరవం, సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక, కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు.. భాగస్వామ్య పనుల్లో లాభాలు పొందుతారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×