BigTV English

Delhi high court denies bail to Kavitha: కవితకు మరోసారి బిగ్ షాక్..

Delhi high court denies bail to Kavitha: కవితకు మరోసారి బిగ్ షాక్..

Delhi high court on MLC Kavitha’s bail(Telangana news): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో కూడా నిరాశే ఎదురైంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆమె బెయిల్ కోరుతూ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను ఢిల్లీ ధర్మాసానం తిరస్కరించింది. సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.


మద్యం కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో మార్చి 15న ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. వారం రోజుల ఈడీ కస్టడీ అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించాక, ఏప్రిల్ లో విచారణ సందర్భంగా సీబీఐ రెండు రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. ఆ తరువాత కవితను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపర్చగా, 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారు.

తనపై ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసులపై బెయిల్ కోరుతూ గతంలో రెండు వేర్వేరు పిటిషన్లను ఢిల్లీ హౌస్ అవెన్యూ కోర్టులో కవిత దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను కవిత.. ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. కవితను నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేశారని, ఒక రాజకీయ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న ఆమెకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ఉంచారంటూ ఆరోపిస్తూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు.


Also Read: తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌ల బదిలీ..

ఇటు సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆ కేసు కీలక దశలో ఉన్నదని, ఈ తరుణంలో కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందంటూ వాదించారు. ఈ కారణాల దృష్ట్యా ఆమెకు ఎట్టిపరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు. వీరి వాదనలను పరిగణలోనికి తీసుకున్న హైకోర్టు కవిత పిటిషన్లను తిరస్కరించింది. దీంతో కవితకు మరోసారి కూడా ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×