BigTV English

Zodiac Signs: సింహ రాశిలోకి వెళ్తున్న కుజుడు – పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసా..?

Zodiac Signs: సింహ రాశిలోకి వెళ్తున్న కుజుడు – పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసా..?

Zodiac Signs: జూన్‌ 7వ తారీఖు నుంచి కుజుడు సింహ రాశిలోకి వెళ్తున్నాడు. దీంతో ద్వాదశ రాశులలో జన్మించిన వారికి కుజుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఎవరి జీవితం మారబోతుంది.. ఎవరి కష్టాలు రాబోతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.


మేషం రాశి: సింహ రాశి లోకి కుజుడు వెళ్లడంతో మేష రాశి వారికి సృజనాత్మకత పెరుగుతుంది. ప్రేమలో తేలికపాటి తగాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు హనుమాన్‌ చాలీసా పఠించడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

వృషభ రాశి: వృషభ రాశి జాతకులకు సింహం లోకి వెళ్తున్న కుజుడి కారణంగా ఇల్లు, భూమి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఓపికగా ఉండాలి. సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది.


మిథున రాశి: ఈ రాశి జాతకులకు ధైర్యం వస్తుంది. ఎదుటి వారి ముందు మాట్లాడే నైపుణ్యం మెరుగవుతుంది. అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరుగుతుంది. మంగళవారం కందులు దానం చేయడం వల్ల అంతా మంచి జరగుతుంది.

కర్కాటక రాశి: కుజుడు సింహ రాశిలోకి వెళ్తుండటం వల్ల ఈ రాశి జాతకులకు ఆర్థిక వ్యవహారాల్లో మాటల వల్ల సమస్యలు రావచ్చు. కుటుంబంలో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. అవి రాకుండా చూసుకోవాలి. అలాగే ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని తరచుగా జపిస్తూ ఉండండి.

సింహ రాశి: ఈ రాశి జాతకులకు స్వక్షేత్రంలోకే కుజుడు వస్తున్నందు వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు పెంపొందించబడతాయి. అయితే హఠాత్తుగా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

కన్య రాశి: ఈ జాతకులకు అనూహ్యంగా ఖర్చులు పెరుగుతాయి. వ్యక్తిగతంగా రిలేషన్స్‌ లో గొడవలు జరిగే ఆస్కారం ఉంది. అయిన వారు దూరం అయ్యే చాన్స్‌ ఉంది. మృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది.

తులా రాశి: ఈ రాశి వారికి కుజుడి మార్పు వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇన్ని రోజులు ఉన్న స్నేహం ప్రేమగా మారే అవకాశం ఉంది. అయితే ఈ రాశి మరిన్ని మంచి విషయాల కోసం చిన్నారులకు స్వీట్లు పంచండి.

వృశ్చిక రాశి: కుజుడు సింహంలోకి వెళ్తుండటంతో వృశ్చిక రాశి వారికి కెరీర్‌లో ఎదుగుదల మొదలవుతుంది. అనుకున్న లక్ష్యాల వైపు వెళ్తారు. అయితే వ్యక్తిగత జీవితానికి కూడా సమయం ఇవ్వడం మంచిది. మంగళవారం మంగళ స్తోత్రం పఠించాలి.

ధనస్సు రాశి: కుజుడి మార్పు వల్ల ఈ రాశి వారికి విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే బంధవులతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది.

మకర రాశి: సింహంలోకి కుజుడు వెళ్లడం వల్ల మకరరాశి జాతకులకు ఊహించని ఆర్థిక మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే ప్రేమలో లోతైన భావోద్వేగాలు ఏర్పడే అవకాశం ఉంది. వీరు సోమవారం శివలింగానికి పాల అభిషేకం చేయడం మంచిది.

కుంభ రాశి: కుజుడి మార్పు వల్ల కుంభ రాశి వారికి జీవిత భాగస్వామితో సంబంధాలు ఒడిదుడుకులకు లోనవుతాయి. వీరు సంయమనం పాటించడం మంచింది. అలాగే శని చాలీసా పారాయణ చేయడం మంచిది.

మీన రాశి: ఈ రాశి జాతకులకు సింహంలోకి వెళ్తున్న కుజుడి వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. విపరీతమైన పోటీని కూడా తట్టుకుని నిలబడగలుగుతారు. అప్పుల నివారణకు ఇది అనుకూల సమయం. వీరు ఓం మంగళాయ నమః అనే మంత్రాన్ని జపించడం మంచిది.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు హిందూ పండితులు మరియు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×