BigTV English

Starlink Internet: ఎలన్ మస్క్ ‘స్టార్ లింక్’కు ఇండియా గ్రీన్ సిగ్నల్.. ఇక సూపర్ స్పీడ్ ఇంటర్నెట్!

Starlink Internet: ఎలన్ మస్క్ ‘స్టార్ లింక్’కు ఇండియా గ్రీన్ సిగ్నల్.. ఇక సూపర్ స్పీడ్ ఇంటర్నెట్!

అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువ అనే విషయం తెలిసిందే. అంతకంటే స్పీడ్ పెంచాలని ప్రభుత్వానికి ఉన్నా.. మనకున్న సాంకేతిక వనరులు దానికి సహకరించవు. ఈ విషయంలో ఇతర ప్రపంచ దేశాలు ఎలన్ మస్క్ కి చెందిన స్టార్ లింక్ ఉపగ్రహ సేవల్ని వినియోగించుకుంటున్నాయి. ఇప్పుడు భారత్ లో కూడా ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. 2022నుంచి ఈ బిజినెస్ డీల్ కోసం భారత ప్రభుత్వంతో ఎలన్ మస్క్ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆ నిరీక్షణ ఫలించింది. భారత్ లో స్టార్ లింక్ సేవలు అతి త్వరలో మొదలుకాబోతున్నాయి. దీనికిసంబంధించి కేంద్రం తాజాగా ఎలన్ మస్క్ కి చెందిన స్టార్ లింక్ సంస్థకు అనుమతి ఇవ్వడం విశేషం.


LEO శాటిలైట్స్ ద్వారా..
టెలికం, ఇంటర్నెట్ సేవలు ఉపగ్రహాల ద్వారా నిర్వహించబడతాయి. ప్రభుత్వం అప్పుడప్పుడు స్ప్రెక్ట్రమ్ వేలం నిర్వహించడం వాటిని వివిధ కంపెనీలు చేజిక్కించుకోవడం తెలిసిందే. అయితే మనకు టెలికం సేవలు, ఇంటర్నెట్ అందించేవి భూ స్థిర ఉపగ్రహాలు. ఇవి దాదాపు భూమికి 35వేల కిలోమీటర్ల ఎత్తున భూ స్థిర కక్ష్యల్లో ఉంటాయి. అంటే భూభ్రమణ వేగానికి సమానే వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. ఇవి సంప్రదాయ శాటిలైట్ సర్వీసెస్ ని అందిస్తుంటాయి. అయితే స్టార్ లింక్ మాత్రం లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోంది. అంటే ఈ ఉపగ్రహాలు భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అప్పుడప్పుడు భూమిపైనుంచి నేరుగా ఈ స్టార్ లింక్ శాటిలైట్స్ ని మనం చూడవచ్చు. ఇవి దాదాపు 6750 ఉన్నాయి. వీటి ద్వారా ఇంటర్నెట్ ప్రసార వేగం మనం ఊహించని స్థాయిలో ఉంటుంది.

వేగంతోపాటు..
స్టార్ లింక్ శాటిలైట్స్ తో కేవలం ఇంటర్నెట్ ప్రసార వేగం మాత్రమే పెరగదు. మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు కూడా సులభంగా అందుబాటులోకి వస్తాయి. అంటే ఇప్పుడు మనం కేబుల్స్, లేదా సెల్ ఫోన్ టవర్ల ద్వారా ఫోన్ సిగ్నల్స్ ఇంటర్నెట్ సర్వీస్ లు స్వీకరిస్తున్నాం. ఇకపై స్టార్ లింక్ శాటిలైట్స్ ద్వారా నేరుగా ఈ సేవలు మనకు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే 100కు పైగా దేశాలతో ఇంటర్నెట్ సర్వీస్ కోసం స్టార్ లింక్ ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు భారత్ కూడా ఆ లిస్ట్ లో చేరింది.


అయితే ఇప్పటికే స్టార్ లింక్ సంస్థతో భారత టెలికం కంపెనీలు జియో, భారతి ఎయిర్ టెల్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో ఈ సేవల్ని నేరుగా స్టార్ లింక్ పేరుతో స్వీకరిస్తారా, లేక ఆ రెండు కంపెనీలు స్టార్ లింక్ ద్వారా మనకు ఇంటర్నెట్ అందిస్తాయా.. అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి స్టార్ లింక్ తో భారత్ చేసుకున్న ఒప్పందంతో మనకు ఇంటర్నెట్ స్పీడ్ మరింతగా పెరిగిపోతుంది. మారుమూల ప్రాంతాలకు, అసలు టెలికం సిగ్నల్సే ఉండని ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ విస్తరిస్తుంది. భారత్ వైపునుంచి ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×