Baby Podcast Video Creating: రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు సృష్టించే అవకాశం కలుగుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతోంది. చాట్ జీపీటీ రాకతో ఏది నిజమో? ఏది అబద్దమో? తెలుసుకోలేకపోతున్నారు. ఏ సమాచారాన్ని అయిన క్షణాల్లో అందించడంతో పాటు దానికి తగిన ఫోటోలు, వీడియోలను కూడా అందిస్తోంది. గతంలో చాలా మంది ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్ ను అడిగేవారు. కానీ, ఇప్పుడు చాట్ జీపీటీ, గ్రోక్ ను గోకుతున్నారు. సింఫుల్ గా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, వినియోగదారులు సమయాన్ని సేవ్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా బేబీ పాడ్ కాస్ట్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
చాట్ జీపీటీతో బేబీ పాడ్ కాస్ట్ వీడియోలు
చాట్ జీపీటీకి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక మనిషితో మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. ఒక మనిషిని మనం ప్రశ్న అడిగితే, ఎలా సమాధానం చెప్తారో అలాగే చెప్తుంది. కొద్ది రోజుల క్రితం వరకు గిబ్లీ స్టైల్ ఇమేజ్ బాగా ఫేమస్ అయ్యింది. ఈ మధ్య బేబి పాడ్ కాస్ట్ వీడియోలు కూడా సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. పెద్ద వాళ్లు అంతా చిన్న పిల్లలుగా మారిపోయి క్యూట్ వీడియోలతో అలరిస్తున్నారు. పాటలు పాడటం నుంచి డైలాగ్ లు చెప్పడం వరకు బోలెడు వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Read Also: వామ్మో ఏనుగు షాపింగ్ చేస్తే ఇలా ఉంటుందా? నెట్టింట వీడియో వైరల్!
జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అయితే బేబీ పాడ్ కాస్ట్ వీడియో రెడీ!
⦿ ముందుగా చాట్ జీపీటీ ఓపెన్ చేయాలి. అందులో మీ ఫోటోను అప్ లోడ్ చేయాలి.
⦿ మీ ఫోటో అప్ లోడ్ అయిన తర్వాత ‘బేబీ ఇన్ పాడ్ కాస్ట్ స్టూడియో’ అని ఎంటర్ చేయాలి.
⦿ కాసేపట్లోనే మీ ఫోటో ఏఐ క్రియేటెడ్ బేబీ ఫోటోగా కనిపిస్తుంది.
⦿ బేబీ ఫోటోను మీరు చాట్ జీపీటీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
⦿ ఆ తర్వాత గూగుల్ లో Hedra.com అని సెర్చ్ చేయాలి.
⦿ హైడ్రా డాట్ కామ్ ఓపెన్ చేసి వీడియో ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
⦿ ఏఐ జనరేటెడ్ ఫొటోని అప్ లోడ్ చేయాలి.
⦿ ఆ తర్వాత ఆడియో ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు కావలసిన ఆడియో సెలెక్ట్ చేసుకోవాలి,
⦿ ఆ తర్వాత జనరేట్ ది వీడియో దానిపైన క్లిక్ చేయాలి.
⦿ కాసేపట్లోనే బేబీ పాడ్ కాస్ట్ వీడియో రెడీ అవుతుంది.
⦿ ఆ వీడియోను డౌన్ లోడ్ చేసుకుని మీరు కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో ఫ్రెండ్స్ తో పంచుకోవచ్చు.
?igsh=N2dlZGdxdHN5Zzdj
Read Also: రైలు నుంచి జారిపడి 146 మంది మృతి.. ఆ ఒక్క డివిజన్ లోనే!