Jupiter Mercury Conjunction: ఈ ఏడాది గ్రహాల కలయక ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఒకసారి ఆరు గ్రహాలు, మరోసారి ఏడు గ్రహాల కలయిక ఏర్పడ్డాయి. దానివల్ల కొన్ని రాశులకు మంచి, మరి కొన్నింటిని చెబు ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెప్పారు. ఆ విషయాన్ని కాసేపు పక్కన బెడదాం. ఏప్రిల్ 14న మిధున రాశిలోకి గురువు ఎంటరవుతున్నాడు. జూన్ ఆరున అదే రాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. పుష్కర కాలం తర్వాత గురువు-బుదుడు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశులకు శుభ యోగం ఏర్పడనుంది.
బుధుడు.. గ్రహాల రాకుమారుడు చెబుతారు. తెలివి తేటలు, జ్ఞానం అనేవి వస్తాయని చెబుతుంటారు. గురువు విషయానికి వద్దాం. ఆ గ్రహం జ్ఞానం, సంతానం, ఐశ్వర్యం మొదలైన వాటిని అందజేస్తుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల రకరకాల ప్రయోజనాలు పొందుతాయి కొన్ని రాశులు.
బుధుడు-గురుడుల కలయికతో కేవలం మూడు రాశులకు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వాటిలో సింహ రాశి ఒకటి. ఆ రాశి వారికి అదృష్టం కలగనుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగ చేసుకోవడంతోపాటు కెరీయర్ లో మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారంలో లాభాలకు కొదవలేదు. అలాగే ఉద్యోగస్థులకు జీతం పెరగనుంది. కాలం కలిసివస్తే ప్రమోషన్ పొందే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ ఉంటే జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. మరో విషయం ఏంటంటే.. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది.
మరొకటి తులా రాశి. ఇందులో నక్షత్రాలు వారికి ప్రధానంగా మానసిక ప్రశాంతత ఉంటుంది. ఒత్తిడి నుంచి రిలీఫ్ లభిస్తుంది. కెరియర్‌లో మంచి స్థాయికి వస్తారు. జీవితం కూడా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని చెబుతున్నారు.
ALSO READ: ఆ రాశి వారికి అన్నింటా విజయం, కొత్త వాహనాలు సైతం
ఇక మూడో రాశి మిధునం. బుధుడు-గురుడు కలయిక వలన మిధున రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డబ్బులు భారీగా అందుకుంటారు. ఇక పోటీ పరీక్షల్లో విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యలున్నవారు ఇప్పుడు బయటపడతారు. కాకపోతే కుటుంబ పెద్దల ఆరోగ్ పై కాసింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
గమనిక : మీకు అందిస్తున్న సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది మేము చెప్పలేము. జ్యోతిష్యుల సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.వీటికి సంబంధించి ఆయా రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.