E-Paper
Advertisement

Christmas 2025 Wishes: ప్రియమైన వారికి క్రిస్మస్ విషెస్ చెప్పాలా? బైబిల్ కోట్స్‌తో ప్రత్యేక సందేశాలు మీ కోసం!

Christmas 2025 Wishes: ప్రియమైన వారికి క్రిస్మస్ విషెస్ చెప్పాలా? బైబిల్ కోట్స్‌తో ప్రత్యేక సందేశాలు మీ కోసం!
Advertisement

Christmas 2025 Wishes: డిసెంబరు 25న జరుపుకునే క్రిస్మస్‌.. ఏసుక్రీస్తు జన్మను స్మరించుకునే పవిత్ర పండుగ. ప్రేమ, క్షమ, త్యాగం అనే విలువలను ఆయన తన జీవితం ద్వారా ప్రపంచానికి నేర్పించారు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం గడపాలని, చేసిన తప్పులను గుర్తించి పశ్చాత్తాపపడితే దేవుడు క్షమిస్తాడని ఏసుక్రీస్తు బోధించారు. అందుకే చెడును త్యజించిన హృదయంలోనే ప్రభువు నివసిస్తాడని చాలామంది విశ్వసిస్తారు. ఈ సందర్భంగా మీ ఆత్మీయులకు బైబిల్స్ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే.. ఈ కోట్స్ మీ కోసమే.

1. ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,
మీ ఇంట ఆనందపు కాంతులు వెలజల్లాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

Advertisement

2. క్రీస్తు జన్మించిన ఈ శుభదినం
మీ అందరికీ శాంతి సౌఖ్యాలను తేవాలని మనసారా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

3. మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక
ఇతరుల కార్యములను కూడ చూడవలెను
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్

Advertisement

4. ఈ క్రిస్మస్ మీ జీవితంలో చీకట్లు తొలగించి
వెలుగువైపు పయనించేలా చేయాలని ఆకాంక్షిస్తూ
క్రిస్మస్ శుభాకాంక్షలు

5. అందరూ ఆ దేవుడి బిడ్డలే..
ప్రపంచ శాంతికోసం అంతా కలసి ఉండాలి
క్రిస్మస్ శుభాకాంక్షలు

6. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను
ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్

7. కోటి దీపకాంతులు మీ చిరునవ్వులుగా మారాలని కోరుతూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

8. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా..!
నా యొద్దకు రండి.. నేను మీకు విశ్రాంతి కలుగజేతును
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

9. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

10. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము
యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ఇదే ఏసుక్రీస్తు సందేహం:

ప్రతి మానవుడు వినయం, స్వచ్ఛత, శాంతి, ప్రేమ, సద్భావన, క్షమాపణ, రహస్య దానాలను స్వీకరించాలి. తాము సంపాదించిన సంపదలో కనీసం కొంత భాగం పేదలకు పంచాలని, దానివల్ల ఎంతో సంతోషం లభిస్తుందని.. అది వెలకట్టలేనిదిగా ఉంటుందన్నదే ఏసుప్రభువు సందేహం.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×