BigTV English

Moles: మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేసే పుట్టుమచ్చలు ఎక్కడుంటాయో తెలుసా..?  

Moles: మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేసే పుట్టుమచ్చలు ఎక్కడుంటాయో తెలుసా..?  

Moles: మాన‌వుడి జాత‌కాన్ని నిర్థేశించ‌డంలో పుట్టుమ‌చ్చలది ఓ ప్రత్యేకమైన పాత్ర. వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలుప‌డంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా, అదృష్ట.. దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయని జ్యోతిష్య నిపుణుల చెప్తున్నారు.  కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి, అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితము ఉంటుందని శాస్త్రం చెబుతోంది.


ధనయోగాన్ని ఇచ్చే పుట్టుమచ్చలు: మాన‌వ దేహంలోని కొన్ని ప్రదేశాల్లో గల పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయని శాస్త్రం స్పష్టం చేస్తోంది. తలపై కుడి భాగంలోనూ, నుదురు మధ్య భాగంలోనూ, కుడి కణతపై, ఎడమ కణతపై, కుడి కన్ను రెప్పపై, కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుంది. ముక్కు కుడి భాగంలోనూ, కుడి చెంపపై, చెవులపై,. నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ఆయా వ్యక్తులను ధనవంతులను చేస్తాయట.

 


ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

శ్రీమంతులను చేసే పుట్టుమచ్చలు: మనిషి శరీరంలో కొన్ని భాగాల్లో పుట్టమచ్చలు ఉంటే ఆ వ్యక్తులు ఎప్పటికైనా శ్రీమంతులు అవుతారట. మెడ ముందు భాగంలో ఏ వైపున ఉన్నా, కుడి భుజం పైన, పొట్ట పైన, హృదయ స్థానంలోను, మోచేతి పైన, కుడి అరచేతిపై, కుడి తొడపై, కుడి మోకాలుపైన మచ్చలు ఉంటే ఆ వ్యక్తులు శ్రీమంతులు అవుతారట. అయితే ఏ వ్యక్తి అయినా కష్టపడకుండా ఏదీ రాదని ఈ స్థానాల్లో మచ్చుల ఉన్న వాళ్లు ఎంత కష్టపడితే అంత వృద్దిలోకి వస్తారట.

పొలిటికల్‌ పుట్టుమచ్చలు: ఏ వ్యక్తి అయినా  రాజకీయంగా ఉన్నత పదవుల్లో ఉండాలంటే తలపై మాడు భాగానికి కుడి వైపున పుట్టుమచ్చ ఉండాటల. ఆలా పుట్టుమచ్చ  ఉన్నట్టయితే..ఆ వ్యక్తి  రాజకీయాల్లో రాణిస్తూ.. ఎప్పుడూ ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవ‌కాశం ఉంటుందట. ఈ మచ్చ ఉన్న వ్యక్తులు మంచి ఆలోచనాపరులై.. తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా, ముందుచూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులు వైవాహిక జీవితం కూడా చాలా అద్బుతంగా ఉంటుందట.

 

ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?

 

ముఖంపై పుట్టుమచ్చలు: స‌హ‌జంగా ఎవరి ముఖమైనా చూడగానే మొదట నొసలు కనబడుతుంది.  ఈ నొసలు మీద పుట్టుమచ్చ ఉంటే.. ఆలోచనాపరుడై.. పది మందిలోనూ.. మంచి వాడనిపించుకుంటాడు.  రెండు కనుబొమల మధ్య పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడట.  ఇక కుడి కనుబొమ మీద మచ్చ ఉంటే వివాహం తొంద‌ర‌గానే అవుతుంది. సుగుణశీలిగ‌ల‌ భార్య లభిస్తుంది. భార్య మూలంగా గొప్ప అదృష్టవంతుడవుతాడు. కుడి కంటి లోపల మచ్చ ఉండినట్లయితే స్థిరాస్తులను కొనగల శక్తివంతుడవుతాడు. కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే.. ఆ వ్యక్తి కోట్ల సంపదలను కలిగి ఉంటాడు. మొత్తమ్మీద ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగానే చెప్పవ‌చ్చు.

మనిషి శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనే విష‌యం కూడా చాలా ముఖ్యమే. సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి. మరికొన్ని ఎరుపుగాను, ఆకుపచ్చగాను, తేనెరంగుగాను, పసుపుపచ్చగాను, గంధపు రంగుగా ఉంటాయి. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు అదృష్టానికి సంకేతంగా చెప్తారు. అయితే నలుపు రంగు దరిద్రమునకు, మరికొన్ని అశుభాలకు సూచికంగా పండితులు చెప్తారు.  అలాగే పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉండి పలుచగా ఉండి అవి కొంచెము పొడవు కలిగి ఉంటే గ‌న‌క‌ ఆ వ్యక్తి ధనవంతుడు, కీర్తివంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది. అలాగే ఆ వెంట్రుకలే దట్టముగా ఉండి కొంచెం పొట్టిగా ఉంటే అశుభ ఫలితాలు చేకూరుతాయట.

 

ALSO READ: 2025 లో విపరీతమైన ధనయోగం పట్టబోయే ఐదు రాశులు ఇవే – అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి

 

Related News

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Big Stories

×