Yearly Horoscope 2025: ఈ సంవత్సరం ఐదు రాశుల వారికి విపరీతమైన ధనయోగం పట్టనుందా..? ఆ ఐదు రాశుల వారే కోట్లకు అధిపతులు కానున్నారా..? ఇంతకీ ఆ ఐదు రాశులేవీ…? ఆ అయిదు రాశులకు సంబంధించిన వ్యక్తులే ఎందుకు కోటీశ్వరులు కానున్నారు. అసలు ఈ విషయాలు చెప్పింది ఎవరు..? ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం విపరీతమైన ధనయోగం ఐదు రాశులకు పడుతుందని వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్ బాబా వంగ తన రచనల్లో రాసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ బాబా వంగ ఎవరు ఆయన చెప్పిన మాటలు ఎందుకు పట్టించుకోవాలని మాత్రం తీసిపారేయకండి. బాబా వంగాను “నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్” అని పిలుస్తారు, ఆమె బల్గేరియన్ దేశానికి చెందిన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త. ఆమె చిన్నతనం నుండి అంధురాలు అయినప్పటికీ ఆమె మన బ్రహ్మంగారి లాగా కాలజ్ఞానం రాసింది.
ఆమె రాసిన కాలజ్ఞానంలో ఇప్పటి వరకు అన్ని నిజం అయ్యాయని పాశ్చాత్య దేశాల ప్రజలు నమ్ముతారు. అలా ఆమె చెప్పిన వాటిలో నిజమైన సంఘటనలు కూడా కొన్ని ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచాయి అలాంటి వాటిలో 2001లో ఆమెరికా పెంటగాన్ పై జరిగిన అటాక్, 2004లో వచ్చిన సునామీ లాంటి సంఘటనలు ఉన్నాయి. అయితే బాబా వంగ చెప్పిన ఈ సంవత్సరం ధనవంతులయ్యే అయిదు రాశుల జాబితాలో మొదటిది..
మేష రాశి: మార్చి 21 నుండి ఏప్రిల్ 19 మధ్య జన్మించిన వ్యక్తులు మేష రాశికి సంబంధించిన వ్యక్తులై ఉంటారు. ఈ రాశి జాతకులు డేర్ అండ్ డాషింగ్ లక్షణాలు కలిగి ఉంటారు. ఇదే వారికి జీవితంలో విజయం సాధించడానికి దోహదపడుతుంది. ఇక 2025 సంవత్సరంలో ఈ రాశిలో జన్మించిన జాతకులకు విపరీత ధనయోగం పట్టనుందని బాబా వంగ తెలిపారు. ఈ రాశి వ్యక్తులు ఈ సంవత్సరం వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడం కారణం భారీ ఆర్థిక వృద్దిని సాధిస్తారట. అలాగే వీరి జీవితంలో 2025 గొప్ప విజయాలను ఇస్తుందట. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్టం కూడా బాగా కలిసి వస్తుందని బాబా వంగ తెలిపారట.
వృషభ రాశి : బాబా వంగ చెప్పిన రాశులలో రెండవది వృషభరాశి. ఏప్రిల్ 20 నుంచి మే 20 మధ్య జన్మిచిన వ్యక్తులు వృషభ రాశి జాతకులు. ఈ రాశి జాతకులు కూడా ఈ సంవత్సరం కోట్లకు ఆధిపతులు అవుతారని బాబా వంగ చెప్పారు. 2025లో వృషభ రాశి వారి వినయ విధేయతలే పెట్టుబడిగా కృషి, పట్టుదలనే పరమావధిగా కోట్లకు అధిపతులు అవుతారట. ఈ సంవత్సరం వృషభ రాశి వారి దీర్ఘకాలిక పెట్టుబడులే వారికి ఆర్థిక వృద్దిని ఇస్తాయని తెలిపారు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
మిధునరాశి: ఈ సంవత్సరం (2025) మిథున రాశి వ్యక్తులు కూడా ఊహించని అవకాశాల ద్వారా అనేక రకాలుగా ధనాన్ని సంపాదిస్తారట. అయితే మే 21 మరియు జూన్ 21 మధ్య జన్మించిన వ్యక్తులు మిథున రాశి జాతకులుగా పరిగణిస్తారు. ఈ రాశి జాతకులు నెట్ వర్కింగ్.. ద్వారా కేరీర్‌లో విజయం సాధిస్తారట.
కర్కాటక రాశి: బాబా వంగ చెప్పిన ఐదు రాశులలో కర్కాటక రాశి కూడా ఒకటి. జూన్ 21 నుంచి జులై 22 మధ్య జన్మించిన వ్యక్తులు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వ్యక్తులు సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు సులభంగా అధిగమించడంలో నిష్టాతులు. 2025లో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా కోటీశ్వరులు అవుతారట. అయితే వీళ్లు సరైన పెట్టుబడులు పెట్టడం.. భాగస్వామ్య వ్యాపారాలు చేయడం ద్వారా వీపరీతమైన ధనం సంపాదిస్తారని బాబా వంగ తెలిపారట.
కుంభ రాశి: బాబా వంగా అంచనాల ప్రకారం 2025లో ధనవంతులు కానున్న ఐదు రాశులలో కుంభ రాశి వారు కూడా ఒకరు. జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 మధ్య జన్మించిన వ్యక్తులు కుంభరాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం కుంభ రాశి వారు తమ సృజనాత్మకతను ఉపయోగించి అసాధారణమైన ఆలోచనల ద్వారా విజయవంతమైన వ్యాపారాలు నిర్వహిస్తారట. సాంకేతికత, కళలు మరియు సాంప్రదాయేతర రంగాలలో పని చేసే వారికి 2025 చాలా అభివృద్ధిని మరియు విజయాన్ని ఇస్తుందని బాబా వంగా అంచనా వేశారట.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?