ఉదయం లేచిన వెంటనే ఎక్కువ మంది చేసే పని అద్దం చూడటం. చాలా మంది లేవగానే అద్దం ముందు నిలబడి ముఖం చూసుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మంచిది కాదని చెబుతున్నారు. నిద్రలేచిన వెంటనే అద్దం చూడటం వల్ల నెగటివ్ ప్రభావం ఉంటుందని నమ్మకం. ఈ అలవాటు మన మానసిక స్థితిపై మాత్రమే కాకుండా, ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం చూపుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
అద్దంలో ఎందుకు చూడకూడదు?
వాస్తు ప్రకారం మనం నిద్రలేచిన సమయంలో శరీరం పూర్తిగా చురుకుగా ఉండదు. ఆ సమయంలో మనలో కొంత అలసట, నెగటివ్ ఎనర్జీ ఉంటుందని భావిస్తారు. అలాంటి సమయంలో అద్దంలో మన ప్రతిబింబాన్ని చూస్తే ఆ నెగటివ్ ఎనర్జీ మళ్లీ మనపై పడుతుందని అంటారు. దీంతో రోజంతా మనకు అలసటగా, చిరాకుగా అనిపించవచ్చు. చిన్న విషయాలకు కూడా కోపం రావచ్చు. అందుకే ఉదయం లేవగానే అద్దం చూడకూడదని సూచిస్తున్నారు.
Also read: Snake plant: ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన మొక్క ఇది, దీంతో ఎన్నో లాభాలు
ఇంకా ఇంట్లో అద్దం ఎక్కడ ఉంచుతున్నామన్నది కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా బెడ్ ముందు అద్దం పెట్టుకోవడం మంచిది కాదని వాస్తు చెబుతుంది. నిద్రలేచిన వెంటనే మన ప్రతిబింబం కనిపిస్తే అది వాస్తు దోషంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో టెన్షన్ పెరగడానికి, కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు రావడానికి కారణమవుతుందని నమ్మకం. అలాగే అద్దాలు శక్తిని ప్రతిబింబించే వస్తువులు కాబట్టి వాటిని సరైన దిశలో ఉంచకపోతే ఆర్థిక సమస్యలు కూడా రావచ్చని చెబుతున్నారు.
లేచిక వెంటనే ఏం చేయాలి?
అయితే ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలి అనే విషయానికి వస్తే, పాజిటివ్‌గా రోజును ప్రారంభించడం మంచిదని సూచిస్తున్నారు. ముందుగా చేతులను చూసి రోజు మొదలుపెట్టడం లేదా దేవుడిని స్మరించడం మంచిదని చెబుతారు. అలాగే గదిలో దేవుడి ఫోటో లేదా ప్రకృతి దృశ్యాలు కనిపించేలా ఉంచితే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఈ చిన్న అలవాట్లు మనలో పాజిటివ్ ఎనర్జీ పెంచి, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడతాయి.
Also read: Breast Cancer: మనదేశంలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు ఆలస్యంగా బయటపడుతుంది
అద్దం ఉపయోగంలో కూడా కొన్ని సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఉదయం లేచిన వెంటనే కాకుండా, ముఖం కడిగిన తర్వాత అద్దం చూడాలి. అద్దాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. వాస్తు ప్రకారం అద్దాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచితే మంచిదని చెబుతారు. ఈ విధంగా చిన్న మార్పులు చేస్తే ఇంట్లో పాజిటివ్ వాతావరణం పెరుగుతుంది. మొత్తానికి, ఉదయం లేచిన వెంటనే అద్దం చూడడం తప్పించుకోవడం మంచిదని వాస్తు సూచిస్తోంది.