E-Paper
Advertisement

గద్వాల్లో పట్టపగలే ఇసుక మాఫియా అరాచకం.. పట్టించుకోని అధికారులు..!

గద్వాల్లో పట్టపగలే ఇసుక మాఫియా అరాచకం.. పట్టించుకోని అధికారులు..!
Advertisement

Sand Mafia: స్వేచ్ఛ బ్యూరో:  గద్వాల జిల్లా కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుండి జోగుళాంబ గద్వాల జిల్లాకు టిప్పర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు.

పోలీసులు పట్టుకున్నా.. వదిలేశారా..?

విశ్వసనీయ సమాచారం ప్రకారం, రెండు రోజుల‌ క్రితం గద్వాలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, సదరు వాహనాన్ని ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలిపెట్టినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇది పోలీసుల తీరుపై అనేక అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Also Read: BRS తోక పార్టీ TRS.. కవిత కొత్త పార్టీపై సామ రామ్మోహన్ రెడ్డి సెటైర్లు

పగలు, రాత్రి తేడా లేకుండా దందా..

కర్నూల్, మంత్రాలయం మరియు రాయచూరు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున టిప్పర్లు పగలు, రాత్రి అనే తేడా లేకుండా జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నాయి. ఇంత బహిరంగంగా అక్రమ రవాణా జరుగుతున్నా.. జిల్లా మైనింగ్, రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజా ధనం దుర్వినియోగం

Advertisement

అనుమతులు లేని ఇసుక రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడటమే కాకుండా, భారీ వాహనాల రాకపోకలతో పట్టణ రోడ్లు కూడా దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: రాజకీయ నవశకం.. కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు

Related News

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

Big Stories

Advertisement
×