E-Paper
Advertisement

Most Wanted Arrest: పోలీసుల వలలో ‘మోస్ట్ వాంటెడ్’ ఖాజా.. 28 కిలోల గంజాయి స్వాధీనం!

Most Wanted Arrest: పోలీసుల వలలో ‘మోస్ట్ వాంటెడ్’ ఖాజా.. 28 కిలోల గంజాయి స్వాధీనం!
Advertisement

Most Wanted Arrest: హైదరాబాద్ నగర శివార్లలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీ విజయం లభించింది. సుదీర్ఘ కాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ నిందితుడు ఖాజా వహాబుద్దీన్‌ను ఈగల్ ఫోర్స్ బృందం ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సమీపంలో జరిపిన ఈ ఆపరేషన్‌లో నిందితుడి నుంచి సుమారు 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 14 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఖాజా వహాబుద్దీన్ నేర చరిత్ర అత్యంత సుదీర్ఘమైనది. 2005 నుంచి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇతనిపై దాదాపు 43 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దొంగతనాలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లతో పాటు ప్రమాదకరమైన ఎన్.డి.పి.ఎస్ (NDPS) యాక్ట్ కింద నమోదైన కేసులు ఉన్నాయి. విచారణలో నిందితుడిపై ఇప్పటికే 4 నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి ఇతను కేవలం వాట్సాప్ కాల్స్ ద్వారానే తన నెట్‌వర్క్‌ను నడిపించేవాడని తేలింది.

Advertisement

నిందితుడి విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇతను ఒడిశాలో కేవలం రూ. 10వేలకు కిలో గంజాయిని కొనుగోలు చేసి.. హైదరాబాద్ తీసుకువచ్చి ఇక్కడ రూ. 50వేలుకు విక్రయిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. కేవలం లాభం కోసమే యువత ప్రాణాలతో ఇతను ఆటలాడుతున్నాడని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా నేరస్థుల ఆట కట్టించేందుకు జనవరి 27 నుంచి ‘ఈగల్ ఫోర్స్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు వివిధ కేసుల్లో పరారీలో ఉన్న 225 మంది నిందితులను పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేశారు.

Advertisement

Also Read:శాడిస్ట్ భర్త.. మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి!

Related News

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

Big Stories

Advertisement
×