The Kerala Story 2 Telugu Trailer: ఈరోజు తెలుగులో ది కేరళ స్టోరీ 2 సినిమా ట్రైలర్ విడుదలైంది. విడుదలైన వెంటనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. గతంలో తీవ్ర చర్చలకు కారణమైన ‘ది కేరళ స్టోరీ’కి ఇది సీక్వెల్ కావడం వల్ల, ప్రేక్షకుల్లో ముందే ఆసక్తి ఉంది. ఇప్పుడు ట్రైలర్ రావడంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది.
ఈ సినిమాను కమాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉల్కా గుప్తా, ఆదితి భాటియా, ఐశ్వర్య ఓజా కీలక పాత్రల్లో నటించారు.
ట్రైలర్‌ను గమనిస్తే..మూడు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువతుల కథలను చూపించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ నేపథ్యాల్లో జరిగే సంఘటనలు ఇందులో కనిపిస్తాయి. ప్రేమ పేరుతో కొందరు యువతులను మోసం చేసి, మతమార్పిడికి దారి తీస్తున్నారని ట్రైలర్ ద్వారా చూపించేందుకు ప్రయత్నించారు. ప్రారంభంలో వచ్చే హెచ్చరికాత్మక డైలాగ్ ట్రైలర్‌కు బలమైన ప్రభావాన్ని ఇస్తుంది.
కుటుంబాల బాధ, యువతుల మనోవేదన, వాళ్లపై వచ్చే ఒత్తిడి వంటి సన్నివేశాలు ట్రైలర్‌లో భావోద్వేగంగా చూపించారు. ఒక యువతి తన ఇష్టానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొనే సీన్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్‌కు మరింత బలం ఇచ్చింది.
మేకర్స్ సోషల్ మీడియాలో ట్రైలర్‌ను షేర్ చేస్తూ “ఈసారి మౌనంగా ఉండం… పోరాడతాం” అనే సందేశాన్ని ఇచ్చారు. ఈ మాటలు కూడా చర్చకు దారి తీసాయి. కొందరు ఈ సినిమాను సమర్థిస్తూ, ఇది నిజ సంఘటనల ఆధారంగా ఉందని అంటున్నారు. మరికొందరు మాత్రం ఇది ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసిందని విమర్శిస్తున్నారు.
ఈ సినిమా ఫిబ్రవరి 27, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ విడుదలతోనే పెద్ద చర్చ మొదలవ్వడం చూస్తే, సినిమా రిలీజ్ తర్వాత ఇంకా పెద్ద స్థాయిలో స్పందనలు రావడం ఖాయం. ప్రేక్షకులు ఈ కథను ఎలా స్వీకరిస్తారో చూడాలి.
ALSO READ: Peddi film: భారీ ధరకు రామ్ చరణ్ పెద్ది నాన్ థియేట్రికల్ రైట్స్…చరణ కెరియర్ లోనే హైయెస్ట్!